భార్య గర్భవతి అని తెలియగానే విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్!

టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ తొలి వివాహం 2012లో ముగిసింది. చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాతో పెళ్లి చేసుకున్న కార్తీక్.. ఆ తర్వాత ఆమెకు, క్రికెటర్ మురళీ విజయ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు.

భార్య గర్భవతి అని తెలియగానే విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్!
Nikita Vanjara and Dinesh karthik

Updated on: Aug 17, 2026 | 2:36 PM

టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఓ సంఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. 2007లో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను వివాహం చేసుకున్న కార్తీక్.. ఐదేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చారు. అయితే ఈ విడాకుల సమయంలో నికితా గర్భవతిగా ఉన్నారనే వార్తలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అసలు ఈ వివాహ బంధం ఎందుకు తెగిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది?

చిన్ననాటి స్నేహితురాలినే పెళ్లి చేసుకున్న కార్తీక్

దినేశ్ కార్తీక్, నికితా వంజారా చిన్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయం ఉన్నవారు. వారి కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవని పలు నివేదికలు పేర్కొన్నాయి. 2007లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటికి కార్తీక్ క్రికెట్‌లో తన కెరీర్‌ను నిర్మించుకుంటున్న దశలో ఉన్నారు. మొదట్లో వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగినట్లు వార్తలు వచ్చాయి.

మురళీ విజయ్‌తో వివాహేతర బంధం

2012లో కార్తీక్‌కు తన భార్య నికితా, తన సహచర క్రికెటర్ మురళీ విజయ్ మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతోందని తెలిసింది. ఆ సమయంలో కార్తీక్, మురళీ విజయ్ ఇద్దరూ తమిళనాడు క్రికెట్‌లో కలిసి ఆడినవారు. మురళీ విజయ్ కార్తీక్‌కు స్నేహితుడు, సహచరుడు కూడా కావడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్తీక్, నికితా లేదా మురళీ విజయ్ బహిరంగంగా విస్తృతంగా వెల్లడించలేదు. కానీ, మురళీ విజయ్ కారణంగానే నికితా గర్భవతి అయినట్లు నిర్ధారించుకున్న దినేష్ కార్తీక్ వెంటనే విడాకులు ఇచ్చేశాడు. కార్తీక్‌తో విడాకులు పూర్తయిన కొద్దికాలానికే, 2012లో నికితా మురళీ విజయ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి పిల్లలు కూడా జన్మించారు. ఈ పరిణామం కారణంగానే కార్తీక్-నికితా విడాకుల వెనుక అసలు కారణంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఆ ఘటన కార్తీక్ కెరీర్‌పైనా ప్రభావం

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ సంఘటన కార్తీక్‌ను తీవ్రంగా కలచివేసిందని పలు కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో ఆయన మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, క్రికెట్‌పై కూడా దాని ప్రభావం పడిందని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత స్నేహితుడు, మెంటర్ అభిషేక్ నాయర్ సహాయంతో తిరిగి తన జీవితాన్ని గాడిలో పెట్టుకున్నారని కథనాలు చెబుతున్నాయి.

కొత్త జీవితంతో ముందుకు వెళ్లిన కార్తీక్

విడాకుల తర్వాత కార్తీక్ జీవితంలో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ ప్రవేశించారు. 2013లో వీరి నిశ్చితార్థం జరగగా, 2015లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2021లో కవల కుమారులు జన్మించారు. 2026 మార్చిలో వారికి కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం కార్తీక్ తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. అలాగే వృత్తిపరంగా కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు. ఆర్సీబీకి రెండు కప్పులు అందించిన మాస్టర్ మైండ్‌గా కార్తీక్ బ్రాండ్ భారీగా పెరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us