ముంబై ఇండియన్స్(Mumbai Indians) IPLలో అత్యంత విజయవంతమైన జట్టు. అలాగే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా గతం. ప్రస్తుత 15వ సీజన్‌లో ముంబై జట్టును వరుస పరాజయాలు మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)తో పోటీ పడనుంది. అయితే, ఈ సీజన్ గురించి అంటే ఐపీఎల్ 15వ సీజన్ గురించి మాట్లాడితే, ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండింటిలో విజయం సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ కూడా ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. కానీ, మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
ఓవరాల్ గణాంకాల పరంగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ముంబై ఇండియన్స్ ముందంజలో ఉంది. ఐపీఎల్ పిచ్‌పై ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందగా, 12 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది.
ఇరుజట్ల మధ్య గత 5 మ్యాచ్ గణాంకాలు ఓసారి పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3-2తో ముందంజలో ఉంది. ఓ మ్యాచ్‌లో RCB సూపర్ ఓవర్‌లో గెలిచింది. అయితే, తాజా పరిణామాలు గమనిస్తే, ముంబైకి కష్టంగా మారే అవకాశం ఉంది. ముంబై ఓడిపోకుండా ఉండకూడదంటే మొత్తం జట్టులోని ఆటగాళ్లంతా మంచి ప్రదర్శన చేయవలసి ఉంటుంది. IPL 2022 మొదటి మూడు మ్యాచ్‌లలో, ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లోనూ ఫ్లాప్‌గా మారింది. మరి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడనున్నారో చూడాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య IPL-2022 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మంగళవారం, ఏప్రిల్ 9న జరగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు జరగనుండగా, తొలి ఇన్నింగ్స్ 07:30కి ప్రారంభమవుతుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడొచ్చు?
లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడొచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడొచ్చు?
లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్క్రిప్షన్‌తో ఆన్‌లైన్‌లో చూడొచ్చు. ఇది కాకుండా, మ్యాచ్ అప్‌డేట్లను tv9telugu.comలో కూడా చదవొచ్చు.
Also Read: PBKS vs GT Live Score, IPL 2022: తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. మయాంక్ ఔట్..