Asia Cup 2025 : టీమిండియా మ్యాచ్‌లలో కనిపిస్తున్న ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరు? కోహ్లీకి ఈమె ఏమవుతుదంటే ?

అఫ్గానిస్థాన్‌కు చెందిన 28 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, వ్యాపారవేత్త వజ్మా అయుబీ అకస్మాత్తుగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 2022 ఆసియా కప్ సమయంలో స్టేడియంలో ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమెకు ఉన్న క్రికెట్ పట్ల ఉన్న అభిమానం, కెమెరా ముందు ఆమె ఆత్మవిశ్వాసం చూసి అభిమానులు ముగ్ధులయ్యారు.

Asia Cup 2025 : టీమిండియా మ్యాచ్‌లలో కనిపిస్తున్న ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరు? కోహ్లీకి ఈమె ఏమవుతుదంటే ?
Wazhma Ayoubi

Updated on: Sep 11, 2025 | 12:21 PM

Asia Cup 2025 : అఫ్గానిస్థాన్​కు చెందిన వజ్మా అయుబి అనే 28 ఏళ్ల సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్, బిజినెస్ ఉమెన్ ఇటీవల క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. 2022లో జరిగిన ఆసియా కప్ సమయంలో స్టేడియంలో ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. క్రికెట్ పట్ల ఆమెకున్న ఆసక్తి, కెమెరా ముందు ఆమె ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి ఆమె అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యంత ముఖ్యమైన అభిమానిగా నిలిచింది.

భారత జట్టుతో ప్రత్యేక అనుబంధం

వజ్మా అఫ్గానిస్థాన్ జట్టుకు అభిమాని అయినప్పటికీ, భారత క్రికెట్ జట్టు పట్ల ఆమెకున్న అభిమానాన్ని బహిరంగంగా చాటుకుంది. ఆసియా కప్ 2023లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా, ఆమె విరాట్ కోహ్లీ జెర్సీని ధరించింది. ఈ జెర్సీపై కోహ్లీ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి దుబాయ్​కు ప్రయాణం

వజ్మా అయుబి అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో పుట్టినా, ఆమె చిన్నతనం అమెరికాలో గడిచింది. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో నివసిస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వజ్మా స్థిరమైన, నైతిక ఫ్యాషన్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ఆమె క్రిప్టో, ఆస్తులలో కూడా పెట్టుబడి పెడుతుంది.

సామాజిక కార్యకర్త, ఎన్జీఓలతో అనుబంధం

వజ్మా కేవలం ఒక సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు, ఆమె ఒక సామాజిక కార్యకర్త కూడా. అఫ్గానిస్థాన్‌లోని నిస్సహాయ పిల్లల కోసం పనిచేసే చైల్డ్‌ఫండ్ సంస్థకు ఆమె అంబాసిడర్‌గా పనిచేశారు. తల్లిగా, ఆమె ఎల్లప్పుడూ పిల్లల హక్కులు, విద్య కోసం తన గళాన్ని వినిపిస్తూ ఉంటుంది.

వజ్మా ఎందుకు ట్రెండింగ్‌లో ఉంది?

ఆమె స్టైలిష్ జీవనశైలి, క్రికెట్ పట్ల ఆమెకున్న అభిమానం, భారత క్రికెటర్లకు మద్దతు ఇవ్వడం వల్ల ఆమె నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. వజ్మా అయుబి కేవలం ఒక క్రికెట్ అభిమాని మాత్రమే కాదు, వ్యాపారం, ఫ్యాషన్, సామాజిక కార్యకలాపాలలో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ ప్రపంచంలో ఆమె పేరు లక్షలాది మంది అభిమానుల మధ్య ప్రసిద్ధి చెందింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి