T20 World Cup: ఆసీస్‌ గడ్డపై టీమిండియాతో జర్నీ చేస్తోన్న ఈ యువతి ఎవరో తెలుసా? కోచ్‌కు ఏమాత్రం తీసిపోదు..

|

Oct 19, 2022 | 9:39 PM

రాజ్‌ లక్ష్మి అరోరా టీమిండియా సపోర్టింగ్‌ స్టాఫ్‌లో కీలక సభ్యురాలని తేలింది. ఆమె గత కొన్నేళ్లుగా బీసీసీఐకి కంటెంట్‌ ప్రొడ్యూసర్‌గా పని చేస్తుందట. ఇక టీమిండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఆమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని కూడా తెలిసింది.

T20 World Cup: ఆసీస్‌ గడ్డపై టీమిండియాతో జర్నీ చేస్తోన్న ఈ యువతి ఎవరో తెలుసా? కోచ్‌కు ఏమాత్రం తీసిపోదు..
Raj Laxmi Arora
Follow us on

టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది టీమిండియా. వారితో పాటు 16 మంది సభ్యులతో సపోర్టింగ్ స్టాఫ్‌ కూడా ఆసీస్‌లో అడుగుపెట్టింది. అయితే ఆసీస్‌ ఫ్లైట్‌ ఎక్కేముందు ముంబైలో దిగిన గ్రూప్‌ ఫొటోలో టీమిండియా ప్లేయర్స్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లో ఒకే ఒక అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత టీమిండియా నెట్టింట్లో షేర్‌ చేసిన పలు ఫొటోల్లోనూ ఆమె దర్శనమిచ్చింది. ఇంతకీ ఎవరామె అని ఆరా తీయగా.. రాజ్‌ లక్ష్మీ అరోరా అని తెలిసింది. ఇక పేరు తెలుసుకున్న నెటిజన్లు ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందులో రాజ్‌ లక్ష్మి అరోరా టీమిండియా సపోర్టింగ్‌ స్టాఫ్‌లో కీలక సభ్యురాలని తేలింది. ఆమె గత కొన్నేళ్లుగా బీసీసీఐకి కంటెంట్‌ ప్రొడ్యూసర్‌గా పని చేస్తుందట. ఇక టీమిండియా విదేశాల్లో పర్యటించినప్పుడు ఆమె ఖచ్చితంగా జట్టుతో పాటు ఉంటుందని కూడా తెలిసింది.

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి..

ఇవి కూడా చదవండి

రాజ్‌ లక్ష్మి లింక్‌డిన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్‌లో చదువుకుంది. అక్కడే ఆమె బాస్కెట్‌బాల్, షూటింగ్‌ గేమ్స్‌పై ఆసక్తి పెంచుకుంది. అయితే జర్నలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆతర్వాత 2015లో సోషల్ మీడియా మేనేజర్‌గా బీసీసీఐలో చేరింది. ప్రస్తుతం ఆమె బీసీసీఐకి సంబంధించిన సోషల్‌మీడియా హ్యాండిల్స్‌కు ముఖ్య పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తుందని తెలిసింది. అలాగే అరోరా మరో ముఖ్యమైన బాధ్యతను కూడా చేపడుతున్నట్లు తెలిసింది. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారిణిగా కూడా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

కాగా అరోరా ఎప్పటికప్పుడు టీమిండియా ప్లేయర్లకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేస్తుంది. ప్లేయర్లకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడంలో ఈమెదే కీలక పాత్ర. ప్రస్తుతం బీసీసీఐకి ట్విట్టర్ లో మొత్తం మూడు అధికారికి ఖాతాలు ఉన్నాయి. ఒకటి బీసీసీఐ, రెండోది బీసీసీఐ ఉమెన్, మూడోది బీసీసీఐ డొమెస్టిక్. ఈ మూడు ఖాతాలకు సంబంధించిన బాధ్యతలన్నింటినీ అరోరానే నిర్వహిస్తుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..