IND vs ENG: సమ ఉజ్జీలుగా టీమిండియా, ఇంగ్లండ్.. కీలకంగా మూడో టెస్ట్‌.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?

భారత్‌-ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 1-1 సమమైంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా, ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన 2వ టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది.

IND vs ENG: సమ ఉజ్జీలుగా టీమిండియా, ఇంగ్లండ్.. కీలకంగా మూడో టెస్ట్‌.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?
India Vs England

Updated on: Feb 05, 2024 | 7:07 PM

భారత్‌-ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 1-1 సమమైంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా, ఇప్పుడు విశాఖపట్నంలో జరిగిన 2వ టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. అందుకే ఇప్పుడు మూడో మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇండో-ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యం సాధిస్తుంది. అందుకే మూడో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లకు భారత్ జట్టును ఎంపిక చేయనుంది టీమిండియా. ఇదివరకు మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రమే భారత జట్టను ప్రకటించింది బీసీసీఐ

గాయపడిన రవీంద్ర జడేజా ఇంగ్లండ్ తో సిరీస్‌ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉంది. అలాగే తొలి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లి 3వ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. కేఎల్‌ రాహుల్‌ కూడా మూడో టెస్ట్‌ మ్యాచ్ కోసం జట్టులో చేరనున్నాడు.

ఇవి కూడా చదవండి

IND vs ENG చివరి మూడు టెస్ట్‌ మ్యాచ్ ల షెడ్యూల్ ఇదిగో..

  • ఫిబ్రవరి 15 నుండి 19 వరకు – మూడో టెస్టు (రాజ్‌కోట్)
  • ఫిబ్రవరి 23 నుండి 27 వరకు – నాల్గవ టెస్ట్ (రాంచీ)
  • మార్చి 7 నుండి 11 వరకు – ఐదవ టెస్ట్ (ధర్మశాల)

జైషా అభినందనలు..

 

బూమ్ బూమ్ బుమ్రా..

సమష్ఠిగా రాణించిన భారత బౌలర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..