Video: క్యాచ్ కోసం పరుగెత్తి.. బౌండరీ లైన్‌లో బలంగా ఢీ కొట్టిన ఇద్దరు.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే..

Kagiso rabada and Marco jansen dangerous collision: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 50వ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఆంటిగ్వాలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా ఢీకొన్నారు. కాగిసో రబడా, మార్కో యాన్సెన్ క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో ఒకరినొకరు ఢీకొన్నారు. ఇలా బలంగా ఢీకొనడంతో ఇద్దరూ వెంటనే మైదానంలో పడిపోయారు. దీంతో ఫిజియో రావాల్సి వచ్చింది. ఆ తర్వాత, గాయం కారణంగా, యాన్సెన్ మైదానం నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది.

Video: క్యాచ్ కోసం పరుగెత్తి.. బౌండరీ లైన్‌లో బలంగా ఢీ కొట్టిన ఇద్దరు.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే..
Sa Vs Wi Video

Updated on: Jun 24, 2024 | 9:39 AM

Kagiso rabada and Marco jansen dangerous collision: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 50వ మ్యాచ్ దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఆంటిగ్వాలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తీవ్రంగా ఢీకొన్నారు. కాగిసో రబడా, మార్కో యాన్సెన్ క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో ఒకరినొకరు ఢీకొన్నారు. ఇలా బలంగా ఢీకొనడంతో ఇద్దరూ వెంటనే మైదానంలో పడిపోయారు. దీంతో ఫిజియో రావాల్సి వచ్చింది. ఆ తర్వాత, గాయం కారణంగా, యాన్సెన్ మైదానం నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో కరీబియన్‌ జట్టు ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ ఎనిమిదో ఓవర్‌లో ఐడెన్‌ మార్క్రామ్‌ వేసిన బంతికి భారీ షాట్‌ కొట్టాడు. బంతి గాలిలో చాలా ఎత్తుకు వెళ్లింది. కగిసో రబడా, మార్కో యాన్సెన్ ఇద్దరూ దానిని పట్టుకోవడానికి పరిగెత్తారు. కానీ, ఈ క్యాచ్ నాదే అని ఎవరూ చెప్పలేదు. దీంతో బౌండరీ లైన్‌పై ఇరువురు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ ఘర్షణ జరిగింది. ఆటగాళ్లిద్దరూ మైదానంలో పడిపోవడంతో ఫిజియో రావాల్సి వచ్చింది. కగిసో రబడా పాదం మార్కో యాన్సెన్ పొట్టను బలంగా తాకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

మార్కో యాన్సెన్, కగిసో రబడా ఢీ..

మ్యాచ్ కూడా కొంతసేపు ఆగిపోవడంతో మార్కో జాన్సన్ మైదానం వీడాల్సి వచ్చింది. అతను కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే, ఆ తర్వాత ఫీల్డ్‌కి వచ్చి ఫీల్డింగ్ చేశాడు. కాగా కగిసో రబాడ ఫీల్డింగ్‌లోనే ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరును ఈ వీడియోలో చూడండి..

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ అంతగా రాణించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. కరీబియన్ జట్టు తరపున రోస్టన్ చేజ్ 42 బంతుల్లో 52 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కైల్ మేయర్స్ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. దీని కారణంగా జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆండ్రీ రస్సెల్ చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే అన్రిచ్ నార్ట్జే అతనిని డైరెక్ట్ హిట్ ద్వారా రనౌట్ చేశాడు. ఇది వెస్టిండీస్ భారీ స్కోర్ చేయాలనే ఆశలను దెబ్బతీసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..