West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు

వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక వార్త పెను తుఫాను సృష్టించింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న కరేబియన్ క్రికెట్ జట్టు ఆటగాడిపై సంచలన ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఓ మైనర్ తో సహా 11 మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టాడంటూ ఓ విండీస్ స్టార్ క్రికెటర్ పై కథనాలు వస్తున్నాయి.

West Indies: ఓ మైనర్‌తో సహా 11 మంది మహిళలపై అత్యాచారం .. ఆ విండీస్ స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు
West Indies Cricket

Updated on: Jun 27, 2025 | 11:28 PM

ప్రస్తుతం వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ మధ్యలోనే వెస్టిండీస్ క్రికెట్‌లో ఒక వార్త తుఫాన్ సృష్టించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు చెందిన ఒక ఆటగాడిపై అత్యాచారం ఆరోపణలు కలకం రేపుతున్నాయి. కరేబియన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, 11 మంది మహిళలు వెస్టిండీస్ క్రికెటర్‌పై అత్యాచారం ఆరోపణలు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలిక అని సమాచారం. అయితే ఈ ఆరోపణల తర్వాత , వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆ ఆటగాడిని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా వార్తలు వస్తున్నాయి. కరేబియన్ దేశమైన గయానాలోని ‘కిటెర్’ వార్తా వెబ్‌సైట్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ ఆరోపణలు వచ్చాయి. దీని ప్రకారం 11 మంది మహిళలు గయానీస్ క్రికెటర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ ఆటగాడు ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ సిరీస్ లో కూడా ఉన్నాడని ఈ నివేదిక పేర్కొంది. ఇది మాత్రమే కాదు, వెస్టిండీస్ బోర్డు ఈ ఆటగాడి గుర్తింపును వెల్లడించకుండా కేసును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో, కరేబియన్ ఛానల్ ‘స్పోర్ట్స్ మాక్స్ టీవీ’ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ కిషోర్ షిలోహ్ చెప్పినట్లు ఉటంకిస్తూ, ‘ఆయనకు ఈ సంఘటనలు, ఆరోపణల చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలియదు. బోర్డు ఈ విషయంపై వ్యాఖ్యానించదు’ అని పేర్కొంది.

ఈ ఆరోపణలతో పాటు, ఇదే కేసులో గత రెండు సంవత్సరాలుగా ఒక బాధితురాలు న్యాయం కోరుతున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ మాక్స్ టీవీ నివేదికలో, న్యాయవాది నిగెల్ హ్యూ మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం ఒక మహిళ ఈ విషయం గురించి తనను సంప్రదించిందని పేర్కొన్నారు. నిందితుడైన క్రికెటర్ గత సంవత్సరం (2024) ఆస్ట్రేలియాలో పర్యటించిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గబ్బాలో జట్టు చారిత్రాత్మక టెస్ట్ విజయంలో కూడా భాగమయ్యాడని సదరు న్యాయవాది తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇప్పటివరకు ఆ స్టార్ క్రికెటర్ పై బాధితులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, గత ఏడాది ఆస్ట్రేలియాలో టెస్ట్ విజయం తర్వాత నిందితుడు గయానాకు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు లభించిన సాదర స్వాగతం తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైనట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.