షాకింగ్ న్యూస్.. ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్రపంచ ఛాంపియన్లు.. ఎవరో తెలుసా?
4 Cricketers Retired: 2016లో వెస్టిండీస్ T20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. నలుగురు ఆటగాళ్లు ఆ చారిత్రాత్మక విజయంలో భాగమయ్యారు. ఇప్పుడు నలుగురూ కలిసి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. నలుగురూ దశాబ్దానికి పైగా వెస్టిండీస్ తరపున క్రికెట్ ఆడి తమ దేశాన్ని ఎన్నో మ్యా్చ్‌ల్లో విజయాల బాట పట్టించారు. కానీ, నేడు ఒకే రోజు వీరంతా కలిసి రిటైర్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చారు.
West Indies 4 Women Cricketers Retired: క్రికెట్ ప్రపంచంలో ఒక ఆటగాడు రిటైరవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే, ఒకేరోజు ఎక్కువ మంది ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం చూశారా? ఒకే దేశానికి చెందిన నలుగురు ఆటగాళ్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వెస్టిండీస్ (West Indies Cricket)లో ఇలాంటి ఘటనే జరిగింది. క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ పరిస్థితి బాగాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దేశం ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ కారణంగానే ఈ దేశానికి చెందిన చాలా మంది పురుష ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లలో ఆడేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే క్రమంలో వెస్టిండీస్‌కు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించారు.
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు అనిస్సా మహ్మద్, షకీరా సెల్మాన్, కయాసియా, కిషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు విజేతగా నిలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంలో నలుగురూ భాగమయ్యారు. ఆ తర్వాత వెస్టిండీస్ మహిళల జట్టు మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 సంవత్సరాలు. వన్డేలు, టీ20ల్లో దేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో 141 వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టింది. 117 టీ20 మ్యాచుల్లో 125 వికెట్లు తీసింది. వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో పురుషుల, మహిళల క్రికెట్‌ను కలిపి T20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఆమె నిలిచింది.
View this post on Instagram
అనిస్సా మహ్మద్ తన దేశం తరపున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా బౌలర్‌గా కూడా నిలిచింది. ఆమె వెస్టిండీస్ తరపున ఐదు వన్డే ప్రపంచ కప్‌లు, ఏడు T20 ప్రపంచ కప్‌లు ఆడింది. మార్చి 2022లో ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఆడింది. అయితే ఆ తర్వాత ఎలాంటి మ్యాచ్ ఆడలేదు.
మరో ఫాస్ట్ బౌలర్ అయిన సెల్మాన్ 2008లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించింది. 18 ఏళ్ల కెరీర్‌లో 100 వన్డేల్లో 82 వికెట్లు, 96 టీ20 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు పడగొట్టింది. ఫిబ్రవరి 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన T20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరపున తన చివరి మ్యాచ్ ఆడింది.
కైసియా, కైషోనా సోదరీమణులు. వచ్చే నెలలో ఇద్దరికీ 32 ఏళ్లు వస్తాయి. 2011లో వెస్టిండీస్ తరపున కాసియా తన తొలి మ్యాచ్ ఆడింది. కైసియా 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కసియా తన దేశం తరపున 87 వన్డే మ్యాచ్‌ల్లో 1327 పరుగులు చేసింది. ఇది కాకుండా 70 టీ20 మ్యాచ్‌లు ఆడి 801 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కైషోనా 51 వన్డేల్లో 851 పరుగులు, 55 టీ20ల్లో 546 పరుగులు చేసింది. ఇద్దరూ తమ చివరి మ్యాచ్‌ని డిసెంబర్ 2022లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌తో ఆడారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..