Team India: ఇట్లుంటాది మన రోహిత్‌తో.. వరల్డ్ కప్‌తో క్రికెటర్ల స్టెప్పులు మామూలుగా లేవుగా.. వీడియో

|

Jul 04, 2024 | 12:31 PM

టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీతో టీమ్ ఇండియా భారతదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు ఘన స్వగతం లభించింది.. టీం ఇండియా ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే.. అక్కడికి భారీగా చేరుకున్న ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఇండియా-ఇండియా అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో, కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ట్రోఫీ చూపిస్తూ అభిమానులకు అభివాదం చేశారు..

Team India: ఇట్లుంటాది మన రోహిత్‌తో.. వరల్డ్ కప్‌తో క్రికెటర్ల స్టెప్పులు మామూలుగా లేవుగా.. వీడియో
Team India
Follow us on

టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీతో టీమ్ ఇండియా భారతదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు ఘన స్వగతం లభించింది.. టీం ఇండియా ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే.. అక్కడికి భారీగా చేరుకున్న ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఇండియా-ఇండియా అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో, కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ట్రోఫీ చూపిస్తూ అభిమానులకు అభివాదం చేశారు.. దీని తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు బస్సులో హోటల్ ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు.. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్ యాదవ్‌, సిరాజ్‌ ఇలా ప్రతి ఒక్కరూ ట్రోఫీతో ఫుల్‌ జోష్‌లో కనిపించారు. హోటల్‌లో కేక్‌ కటింట్‌ సెలబ్రేషన్‌ కూడా గ్రాండ్‌గా జరిగింది.. ఈ క్రమంలో హోటల్ కు చేరుకున్న రోహిత్ శర్మ.. కళాకారులతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు.

రోహిత్ తో పాటు సూర్య కూడా స్టెప్పులేశాడు.. కళాకారులతో కలిసి ఎంజాయ్ చేశాడు..

రిషబ్ పంత్, సిరాజ్ సైతం భంగ్రా నృత్యానికి స్టెప్పులేశారు.. కళాకారులతో కలిసి వారంతా జోష్ లో స్టెప్పులేస్తూ.. ఊత్సాహంగా కనిపించారు.

అభిమానుల మధ్య టీమిండియా ఆటగాళ్ల  డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.