
Mohammad Naim, Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు పాకిస్తాన్, శ్రీలంకలో సంయుక్తంగా జరగనుంది. టోర్నీకి ముందు అన్ని జట్లు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఆసియా కప్, ప్రపంచకప్ వంటి భారీ టోర్నీలకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గందరగోళంలో పడింది. గాయం కారణంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత బోర్డు అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శించి ట్రోఫీని గెలవాలనుకుంటోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మద్ నయీమ్ టోర్నమెంట్‌లో ఒత్తిడిని ఎదుర్కొవడానికి కొన్ని విభిన్నమైన ట్రిక్స్ చూపిస్తున్నాడు. మహ్మద్ నయీమ్ మైండ్ ట్రైనర్ సహాయంతో నిప్పుల గుండంపై నడిచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆసియా కప్ 2023కి ముందు, బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మద్ నయీమ్ ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కనుగొన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, మహ్మద్ నయీమ్ మైండ్ ట్రైనర్ సహాయంతో కాలుతున్న బొగ్గులపై నడుస్తున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ మైండ్ ట్రైనర్ చాలా ఫేమస్. ఆయన ఆధ్వర్యంలో ఒత్తిడిపై చాలా వర్క్‌ట్స్ చేస్తున్నాడు.
ఈ మైండ్ ట్రైనర్‌లు ప్రతి క్రీడాకారుడిని ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి వివిధ మార్గాల్లో సహాయం చేస్తుంటారు. మహ్మద్ నయీమ్ వీడియోపై అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు ఇస్తున్నారు. క్రికెట్‌లో గెలవలేనప్పుడు, గెలిచేందుకు మరో మార్గం దొరుకుతుందంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అదే సమయంలో కొంతమంది అభిమానులు దీనిని పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bangladesh’s Mohammad Naim working with a mind trainer and firewalking ahead of Asia Cup 2023. pic.twitter.com/Byf2T8JMWn
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023
ఇక ఆసియా కప్ 2023 షెడ్యూల్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ శ్రీలంకతో తలపడనుంది. ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తొలి మ్యాచ్ ఆగస్టు 31న పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో ఆడనుంది. మరోవైపు, టీమిండియా గురించి మాట్లాడితే మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో ఆడనుంది.
The Bangladesh Squad for the Asia Cup 2023. 🏏 🇧🇩#BCB | #cricket | #AsiaCup2023 pic.twitter.com/lv3Yd7Twix
— Bangladesh Cricket (@BCBtigers) August 12, 2023
World Cricket is incomplete without these two Greatest players ❤️
Virat × Babar ♥️♥️#Cricket #LPL2023 #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/k7dnfy3njw— Akhtar Jamal (@AkhtarActivist) August 12, 2023
This is insane 🔥#AsiaCup2023 pic.twitter.com/QBjnuKK1xI
— Rohit !!! (@76Rohitvro) August 17, 2023
Ready for Asia Cup 🥵🔥 #ViratKohli𓃵#AsiaCup2023 #AsiaCuppic.twitter.com/run7Fw5aU2
— kohl!ty¹⁸ 🇮🇳 (@Kohlity82) August 11, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..