IPL 2022: నేచురల్‌ స్టార్‌ నాని, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ.. నెట్టింట్లో వైరల్‌..

|

Mar 19, 2022 | 9:23 PM

Natural Star Nani: ధనాధన్‌ టోర్నీ ఐపీఎల్‌-2022 (IPL) సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలై పోగా.. ఆయా ఫ్రాంఛైజీలు తమ జట్లను ప్రమోషన్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాయి.

IPL 2022: నేచురల్‌ స్టార్‌ నాని, ఎస్‌ఆర్‌హెచ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ.. నెట్టింట్లో వైరల్‌..
Follow us on

Natural Star Nani: ధనాధన్‌ టోర్నీ ఐపీఎల్‌-2022 (IPL) సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలై పోగా.. ఆయా ఫ్రాంఛైజీలు తమ జట్లను ప్రమోషన్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. ఈక్రమంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌ యువ ఆటగాడు ఆభిషేక్‌ శర్మ స్టెప్పులేసిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. తాజాగా ప్రముఖ​ టాలీవుడ్‌ హీరో, నేచురల్‌ స్టార్‌ నానిని, తమ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో లింక్‌ చేస్తూ ట్విటర్‌లో మరో పోస్ట్‌ షేర్‌ చేసింది. కాగా నాని (Nani) హీరోగా అంటే సుందరానికి పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తమ జట్టు ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ ప్రాక్టీస్‌ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాన్యం ‘అంటే ఆ సుందరం జూన్‌లో వస్తాడు, ఈ సుందర్ ఆల్‌రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు’ అని రాసుకొచ్చింది.

దీనికి నేచురల్ స్టార్ నాని కూడా స్పందించాడు. ‘ఆల్ ది బెస్ట్ సుందర్, ఫ్రం సుందర్..’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు . వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ‘వచ్చాను గయ్స్’ అంటూ మరో ట్వీట్‌ పెట్టాడు. దీంతో ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అవుతోంది. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో వాషింగ్టన్‌ సుందర్‌ను ఏకంగా రూ.8.75 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్. గత సీజన్‌ వరకు బెంగళూరు తరపున ఆడిన ఈ స్పిన్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వేలంలో పట్టుబట్టి మరీ సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్‌-15వ సీజన్‌ మార్చి 26న ప్రారంభం కానుంది. ముంబయి వేదికగా చెన్నై,కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. తన తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. మార్చి 29వ తేదీన జరగనుంది.

Also Read:Visakha-TTD: విశాఖ‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు.. స్వామివారికి వెండి వస్తువులను బహుకరించిన భక్తులు

Micro-Zombie: మంచు కొండల్లో పరిశోధన..శాస్త్రజ్ఞులకు షాక్ 24 వేల ఏళ్ళనుంచి సజీవంగా ఓ వింత జీవి..

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత