IND vs NZ: టీమిండియాకు అతనో అద్భుతమైన సారథి.. జట్టుతో ఏమైనా చేయించగలడని లక్ష్మణ్ కితాబు..

|

Nov 17, 2022 | 12:19 PM

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత క్రమంగా క్రికెట్ జట్లన్నీ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం సన్నద్ధమవుతున్నాయి, భారత్ జట్టు కూడా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి మొదటి టీ20 మ్యాచ్‌ను..

IND vs NZ: టీమిండియాకు అతనో అద్భుతమైన సారథి.. జట్టుతో ఏమైనా చేయించగలడని లక్ష్మణ్ కితాబు..
Hardik Pandya
Follow us on

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత క్రమంగా క్రికెట్ జట్లన్నీ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం సన్నద్ధమవుతున్నాయి, భారత్ జట్టు కూడా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి మొదటి టీ20 మ్యాచ్‌ను ఆడబోతుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ 3 టీ20 లు, 3 వన్డేల సిరీస్‌లను ఆడనుంది. టీ20 సిరీస్‌కు యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు సారథ్యం వహించబోతుండగా, వన్డే సిరీస్‌కు మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. అలాగే ఈ రెండు సిరీస్‌లకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ కోచ్‌గా ఉంటాడు. శుక్రవారం వెల్లింగ్టన్‌లో జరగబోతున్న మొదటి టీ20 సందర్భంగా లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఈ సిరీస్‌లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించనున్న హార్దిక్ ప్యాండ్యా మీద పొగడ్తల వర్షం కురిపించారు.

“ఇది నాకు ఆనందకరమైన పర్యటన. జట్టులోని యువ ఆటగాళ్లతో నా అనుభావాన్ని పంచుకోవడానికి లభించిన సువర్ణావకాశం. భారత జట్టులోని వీళ్లంతా మంటి టాలెంటెడ్ ప్లేయర్లని ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్నప్పుడు నాకు అనిపించింది. కానీ ఎంత ప్రతిభ ఉన్నా అనునిత్యం ప్రాక్టీస్ చేయాలి, ఆటను మెరుగు పరుచుకోవాలి. భారత్‌లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఎంపిక చేసుకోగలిగే అంత మంది ఆటగాళ్లను కలిగి ఉండటం భారత్‌కు అదృష్టమే’’ అని అన్నారు. జట్టు నాయకుడిగా హార్దిక్ పాండ్యా గురించి ఆయన మాట్లాడుతూ.. “ హార్దిక మంచి నాయకుడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో అతడు ఏం చేసి చూపాడో మనమందరం చూశాం.

టోర్నమెంట్‌లో ఒక ఫ్రాంచైజీకి మొదటి సంవత్సరంలో నాయకత్వం వహించడం, ఆ సంవత్సరమే లీగ్‌ను గెలవడం అనేది మామూలు విషయం కాదు. అతను తన జట్టుతో ఏదైనా చేయించగలడు, సాధించగలడు. ఐర్లాండ్ సిరీస్ ఉన్నప్పుడు నేను అతనితో చాలా సమయం గడిపాను. అతను వ్యూహాత్మకంగా మాత్రమే కాకుండా, మైదానంలో ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో జట్టు నాయకుడిగా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా అతను మైదానంలో తన జట్టును నడిపించే విధానం అద్భుతం’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..