2019 ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం రోజున మనదేశం మొత్తం ఉలిక్కిపడిన రోజు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగి మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారు. వాలంటైన్స్‌డే రోజున ఈ ఉగ్రదాడి జరగడంతో దేశంతో పాటు ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద సమయంలో దేశమంతా సైనికుల పక్షాన నిలబడింది. అందులో టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సైనికుల పిల్లలను ఉచితంగా చదివిస్తానని ఆ సమయంలో మాట ఇచ్చాడు. ఏదో భావోద్వేగంలో మాటిచ్చాడేమో అనుకున్నారు చాలామంది. అయితే సెహ్వాగ్ మాత్రం తన మాటలను మరుక్షణమే ఆచరణలోకి తెచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు జవాన్ల పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నాడు. హర్యానాలోని తన స్కూల్‌లో ఆ పిల్లలకు చదువుతో పాటు క్రికెట్‌లోనూ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన రామ్ వకీల్ కుమారుడు అర్పిత్ సింగ్, విజయ్ తనయుడు రాహుల్ సోరెంగ్‌లు ప్రస్తుతం హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే విద్యను అభ్యసిస్తున్నారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఈ దుర్ఘటనను మరోసారి గుర్తుతెచ్చుకున్నాడు సెహ్వాగ్. అదే సమయంలో తన స్కూల్‌లో చదువుతోన్న జవాన్ల పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘పుల్వామా అటాక్‌లో అమరులైన సైనికుల జీవితాల్లో చిన్న పాటి వెలుగు నింపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ వకీల్ కుమారుడు అర్పిత్ సింగ్, విజయ్ కుమారుడు రాహుల్‌లను చదివిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది’అని రాసుకొచ్చారు సెహ్వాగ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెహ్వాగ్ అమర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయమంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Very privileged to have been able to contribute in a small way in the lives of son of our heroes of #PulwamaAttack who have been studying at @SehwagSchool
Arpit Singh s/o Shaheed Ram Vakeel &
Rahul Soreng s/o Shaheed Vijay Soreng.Nothing can beat this happiness. V Fulfilling pic.twitter.com/MHb0Jv8pgx
— Virender Sehwag (@virendersehwag) February 14, 2023
Son of Heroes !
What a privilege to be able to have these two at @SehwagSchool and have the fortune to contribute to their lives.
Batsman – Arpit Singh s/o Pulwama Shaheed Ram Vakeel &
Bowler- Rahul Soreng s/o Pulwama Shaheed Vijay Soreng.
Few things can beat this happiness ! pic.twitter.com/Z7Yl4thaHd— Virender Sehwag (@virendersehwag) October 16, 2019
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..