Team India: అక్కడ ఎక్కువగా కష్టపడితే నష్టమే.. ఆ సమస్యలతో మేం ఒక్క మ్యాచ్ మిస్ కాలే: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

Virender Sehwag: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుత ఆటగాళ్ల గాయాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆటగాళ్లు పదే పదే గాయపడుతుండటంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Team India: అక్కడ ఎక్కువగా కష్టపడితే నష్టమే.. ఆ సమస్యలతో మేం ఒక్క మ్యాచ్ మిస్ కాలే: సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..
Virender Sehwag

Updated on: Mar 17, 2023 | 12:50 PM

భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుత ఆటగాళ్ల గాయాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆటగాళ్లు పదే పదే గాయపడుతుండటంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఆటగాళ్ళు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది వారి శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మా కాలంలో ఏ ఆటగాడు వెన్ను గాయానికి గురికాలేదని, ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయిందంటూ సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

భారత జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయం కారణంగా దూరమయ్యారు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతనికి వెన్ను గాయంతో దూరమయ్యాడు. అదే సమయంలో, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా చాలా కాలం పాటు దూరంగా ఉన్నాడు.

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ప్రభావితం చేసే జిమ్‌లు- సెహ్వాగ్..

క్రికెట్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ప్రయోజనం లేదని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్లే ఎక్కువగా గాయపడుతున్నారు. క్రీడాకారులు జిమ్‌లో ఎక్కువ సమయం గడపకూడదు’ అంటూ మాజీ డాషింగ్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఆయన మట్లాడుతూ.. క్రికెట్‌లో వెయిట్‌లిఫ్టింగ్ చేయకూడదు. బదులుగా ఆటను మెరుగుపరిచే వ్యాయామాలు చేయాలి. వెయిట్ లిఫ్టింగ్ మిమ్మల్ని బలపరుస్తుంది. కానీ, చాలా అలసిపోతారు. మా కాలంలో ఆకాష్ చోప్రా, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లు వెన్ను, స్నాయువు లేదా క్వాడ్ గాయాల కారణంగా ఎన్నడూ తప్పుకోలేదని తెలిపాడు.

భారత ఆటగాళ్లకు గాయం పెద్ద సమస్యగా మారింది. చాలా మంది భారత ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్నారు. ఇది వారి కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..