
Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి. 36 ఏళ్ల వయసులో అతను త్వరలోనే రిటైర్ అవుతాడని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను పట్టించుకోకుండా కోహ్లీ తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహ్లీ తన తదుపరి మ్యాచ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ ఇటీవల లండన్‌లో ఒక అభిమానితో కలిసి సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోలో కోహ్లీ ప్రాక్టీస్ నెట్‌లో, ట్రెయినింగ్ దుస్తులలో కనిపించాడు. ఇది అతను తిరిగి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడని సూచిస్తోంది. ఈ ఫోటోను చూసి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెటర్‌గా ఉన్నాడు.
ఈ ఫోటోపై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ పక్కా అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. మరో అభిమాని “మా మ్యాన్ బతికే ఉన్నాడు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు!” అని కామెంట్ పెట్టారు. ఇంకొకరు “అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అక్టోబర్‌లో ఉంది. మా వాడొస్తున్నాడు,” అని పోస్ట్ చేశారు.
THE 2027WC IS ONNNNN https://t.co/kBzrEj562E
— ౨ৎ | weyler endgame (@kohlispleader) August 18, 2025
my man is aliveeee and practicing too!!! 😭🔥 https://t.co/8V1vbG3Utn
— Sarah ❤️ (@mi_amor_virat) August 18, 2025
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ ఫోటో బయటపడింది. ఇప్పుడు కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే, కోహ్లీ తన కెరీర్‌ను మరికొన్ని ఏళ్లు కొనసాగిస్తే, వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఇటీవల 14,000 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ, సచిన్ రికార్డుకు 4,000 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే, సచిన్‌తో పోలిస్తే కోహ్లీ సగటు గణనీయంగా మెరుగ్గా ఉంది. కోహ్లీ చివరిసారిగా ఐపీఎల్ 2025లో ఆడాడు. ఆ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 18 ఏళ్ల కలను నెరవేర్చి టైటిల్ గెలిపించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..