Virat Kohli: కోహ్లీ కష్టపడడం మానుకోలేదు.. అందుకే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు..

|

May 20, 2022 | 3:39 PM

ఎట్టకేలకు విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాట్‌కు పని చెప్పాడు. విరాట్ కోహ్లీ రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌(GT)పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ(RCB) ఘన విజయం సాధించింది...

Virat Kohli: కోహ్లీ కష్టపడడం మానుకోలేదు.. అందుకే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు..
Virat Kohli
Follow us on

ఎట్టకేలకు విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాట్‌కు పని చెప్పాడు. విరాట్ కోహ్లీ రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌(GT)పై 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ(RCB) ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ఓ  విషయం చెప్పాడు. పేలవమైన ఫామ్ చాలా కాలం పాటు కొనసాగితే అది ఎవరినైనా నిరుత్సాహపరుస్తుందని హెస్సన్ చెప్పాడు. గుజరాత్ టైటాన్స్‌పై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 73 పరుగులతో కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా RCBని ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. కోహ్లీ 13 సార్లు విభిన్న మార్గాల్లో ఔటయ్యాడు. కోహ్లీ ఎప్పుడూ కష్టపడి పనిచేయడం మానుకోలేదని, అది తన పునరాగమనానికి సహాయపడిందని హెస్సన్ చెప్పాడు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో హెస్సన్ మాట్లాడుతూ ‘విరాట్ నెట్స్‌లో చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ 13 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లలో కోహ్లీ సింపుల్‌గా ఔటయ్యాడు. ‘మీరు ఈ రకమైన పేలవమైన రూపంలోకి వెళుతున్నప్పుడు – ఒక వ్యక్తి కొంచెం ఒత్తిడికి గురవుతాడు. అదృష్టం ఎప్పుడు మారుతుందో అని ఆశ్చర్యపోతాడు. గుజరాత్‌పై విరాట్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇలాంటి ఆటతీరుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని హెస్సన్‌ అన్నాడు. ప్రస్తుతం RCB నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ సానుకూల రన్ రేట్‌తో 14 పాయింట్లతో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతవుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడవార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..