Virat Kohli: ‘జెర్సీ నంబర్ 18’ వెనుక ఇంతటి విషాధ గాధ ఉందా..? అందుకేనా కోహ్లీ మినహా టీమిండియాలో మరెవరూ ధరించరు..!

|

Mar 25, 2023 | 4:36 PM

మైదానంలోకి దిగిన ప్రతిసారీ కూడా కింగ్ కోహ్లీ 18 నంబర్ ఉన్న జెర్సీని ధరించి ఉంటాడు. 2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీనే ధరించాడు. తన నాయకత్వంలో జట్టును చాంపియన్‌గా..

Virat Kohli: ‘జెర్సీ నంబర్ 18’ వెనుక ఇంతటి విషాధ గాధ ఉందా..? అందుకేనా కోహ్లీ మినహా టీమిండియాలో మరెవరూ ధరించరు..!
Virat Kohli 1
Follow us on

జెర్సీ నంబర్ 18 చెప్పగానే.. క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ టీమిండియా, ఐపిఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ఇక మైదానంలోకి దిగిన ప్రతిసారీ కూడా కింగ్ కోహ్లీ 18 నంబర్ ఉన్న జెర్సీని ధరించి ఉంటాడు. 2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీనే ధరించాడు. తన నాయకత్వంలో జట్టును చాంపియన్‌గా కూడా మార్చాడు. ఆపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన తర్వాత కూడా కోహ్లీ 18 నంబర్ జెర్సీని మాత్రమే ధరిస్తున్నాడు. అసలు ఆ 18 నంబర్ ప్రత్యేకత ఏమిటి..? ఆ నంబర్‌తో కోహ్లీకి సంబంధం ఏమిటి..? ఎప్పుడూ మైదానంలో సరదాగా, సీరియస్‌గా ఉండడమే తప్ప బాధపడని కోహ్లీకి ఆ నంబర్‌తో  ఓ ప్రత్యేకమైన బంధం ఉంది. నిజానికి ఈ నంబర్ జెర్సీని కోహ్లీ ధరించడం వెనుక ఓ ఎమోషనల్ రీజన్ ఉంది.

2008 అండర్ 19 ప్రపంచకప్‌కు ముందు అంటే.. 2006 డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి అయిన ప్రేమ్ కోహ్లీ మరణించారు. తన తండ్రి చనిపోయే సమయానికి 17 ఏళ్ల వయసున్న కోహ్లీ కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ ఆడుతున్నాడు. ఈ వార్త తెలిసినప్పటికీ జట్టు కోసం తన విధిని పూర్తి చేసే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి, కోచ్‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్న కోహ్లీ ఆ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. అనంతరం తన తండ్రి జ్ఞాపకార్థం 18వ నంబర్ జెర్సీని ధరించాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. అప్పటి పరిస్థితి గురించి కోహ్లీ మాట్లాడుతూ.. ‘మా నాన్న చనిపోయిన ఆ రాత్రి నాకు ఇంకా గుర్తు ఉంది. కానీ మా నాన్న మరణం తర్వాత సహజంగానే రంజీ ఆడేందుకు నాకు పిలుపు వచ్చింది. ఉదయం నా (ఢిల్లీ) కోచ్‌కి ఫోన్ చేసి ఈరోజు మ్యాచ్‌లో ఆడతానని చెప్పాను. ఎందుకంటే నా జీవితంలో ఈ క్రీడకు ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ’ అని తెలిపాడు.

తండ్రి ప్రేమ్ కోహ్లీతో విరాట్ కోహ్లీ

మరోవైపు కోహ్లీ మినహా మరే టీమిండియా ఆటగాడు కూడా 18వ నంబర్ జెర్సీని ధరించలేదు. జట్టులో కోహ్లీ ఉన్నా లేకున్నా.. సచిన్‌కు 10వ నంబర్‌ను అంకితం ఇచ్చిన తరహాలోనే కోహ్లీకి కూడా 18వ నంబర్ అంకితం అన్నట్లుగా ఎవరు ధరించరు. ఇక ఐపీఎల్ 16వ సీజన్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుండగా.. కోహ్లీ ఆడుతున్న ఆర్‌సీబీ జట్టు ఏప్రిల్ 2న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..