
Virat Kohli: సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించారు. అయితే, నేడు సౌరాష్ట్రతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కోహ్లీ తుది జట్టులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు కోహ్లీ ఎందుకు ఆడటం లేదు..? మళ్ళీ ఎప్పుడు జట్టులోకి వస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం..
విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ సంచలనం: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ద్వారా దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే తన క్లాస్ ఏంటో నిరూపించిన కోహ్లీ, పరుగుల వరద పారించారు. ఆంధ్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 131 పరుగులు, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 77 పరుగులు చేసి ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.
బెంగుళూరులోని ఆలూరు గ్రౌండ్‌లో నేడు (డిసెంబర్ 29) ఢిల్లీ వర్సెస్ సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడటం లేదు. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత విరామం. మొదటి రెండు మ్యాచ్‌లలో తన సత్తా చాటిన కోహ్లీ, ప్రస్తుతానికి జట్టును వీడి ముంబైకి వెళ్లాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఒత్తిడి, రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఈ విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కోహ్లీ అభిమానులకు ఒక శుభవార్త ఏమిటంటే, ఆయన టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకోలేదు. తాజా సమాచారం ప్రకారం, జనవరి 6, 2026న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ తిరిగి ఢిల్లీ జట్టుతో చేరే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌ను కోహ్లీ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..