Video: కోహ్లీ పేరుతో నినాదాలు.. సైగలు చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నవీన్-ఉల్-హక్.. వైరల్ వీడియో..

|

May 17, 2023 | 5:28 PM

Virat Kohli vs Naveen-ul-Haq: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ గొడవపడ్డప్పటి నుంచి IPL 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు.

Video: కోహ్లీ పేరుతో నినాదాలు.. సైగలు చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నవీన్-ఉల్-హక్.. వైరల్ వీడియో..
Virat Kohli Vs Naveen-ul-Haq
Follow us on

Virat Kohli vs Naveen-ul-Haq: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ గొడవపడ్డప్పటి నుంచి IPL 2023 పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఈమార్పులకు ముఖ్యంగా ఇరువైపుల అభిమానులు తోడయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అవకాశం రాగానే మైదానంలో గంభీర్, నవీన్ ఉల్ హక్‌లపై నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే గంభీర్‌ను టార్గెట్ చేసుకుని కోహ్లీ అభిమానులు హోరెత్తించారు. ఇక నిన్న జరిగిన ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లోనూ మరోసారి ఇలాంటి సీన్ కనిపించింది.

మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తమ సొంత మైదానం ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, ఆఫ్ఘన్ పేసర్ నవీన్-ఉల్-హక్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతను చివరి 2 మ్యాచ్‌లకు జట్టుకు దూరమయ్యాడు. బౌలింగ్‌లో నవీన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ పడగొట్టలేదు.

ఇవి కూడా చదవండి

కోహ్లీ నినాదాలు చేయాలంటూ సైగలు..

ఈ మ్యాచ్‌లో నవీన్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కొందరు అభిమానులు విరాట్ కోహ్లీ పేరుతో నినాదాలు చేస్తూ ఆటపట్టించే ప్రయత్నం చేశారు. అయితే, నవీన్ కూడా తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, తన చేతితో సైగలు చేసి, నినాదాలు చేయడం కొనసాగించమని వారిని కోరాడు. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్‌పై దృష్టి సారించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..