Virat Kohli Depression: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో డిప్రెషన్‌తో బాధపడ్డానని వెల్లడించాడు. ఆ టూర్‌లో అతడు 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి “నేను వెళ్తున్నదాన్ని మార్చుకోడానికి ఏం చేయాలో కూడా తెలియని దశ అది. ఆ సమయంలో నేను ఈ ప్రపంచంలో ఒంటరి వ్యక్తిలా భావించాను” అంటూ తన జీవితంలోని బ్యాడ్ డేస్ గురించి చెప్పుకొచ్చాడు కోహ్లీ.
‘నాట్ జస్ట్ క్రికెట్’ అనే పోడ్‌కాస్ట్‌లో ప్రముఖ వ్యాఖ్యాత నికోలస్‌తో చేసిన చాట్‌లో, హెడ్‌స్ట్రాంగ్ వ్యక్తిగా పేరొందిన కోహ్లీ ఆ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో డిప్రెషన్‌తో పోరాడినట్లు షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ఆ సమయంలో తన చుట్టూ మద్దతుగా నిలిచే వ్యక్తులు ఉన్నప్పటికీ, వృత్తిపరమైన సహాయం అవసరమని బలంగా భావించానని చెప్పుకొచ్చారు. కరోనా కాలంలో బయో బబుల్‌లో ఉండాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై చర్చ మరింత తీవ్రమైందని కోహ్లీ చెప్పాడు. టీమ్‌తో మానసిక ఆరోగ్య నిపుణుడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం భారత కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
డిప్రెషన్ ఎంత ప్రమాదకరమై వ్యాధో ఇప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రమైన మనో వేధన కారణంగానే బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రముఖ వ్యక్తులు ఈ విషయంపై మాట్లాడుతూ.. సదరు అంశంపై చర్చ జరిగేలా చేయడం మంచి పరిణామంగానే చెప్పాలి.
Also Read:
ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ
వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సంస్థ సరికొత్త ప్రచారం.. కొత్త డెడ్‌లైన్ ఇదే..!