IPL Auction 2021: చెన్నై కాదు పొమ్మంది.. కోల్‌కతా కావాలి రమ్మంది.. రెండు కోట్ల ధర పలికిన టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్..

IPL Auction 2021: 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ఆడిన హర్భజన్‌ అప్పటి నుంచి సరైన మ్యాచ్‌లు‌ ఆడలేదు. అయినా,‌ ఈసారి ఐపీఎల్‌ వేలంలో తన కనీస ధరను రూ.2 కోట్లుగా

  • uppula Raju
  • Publish Date - 12:11 pm, Fri, 19 February 21
IPL Auction 2021: చెన్నై కాదు పొమ్మంది.. కోల్‌కతా కావాలి రమ్మంది.. రెండు కోట్ల ధర పలికిన టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్..

IPL Auction 2021: 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ఆడిన హర్భజన్‌ అప్పటి నుంచి సరైన మ్యాచ్‌లు‌ ఆడలేదు. అయినా,‌ ఈసారి ఐపీఎల్‌ వేలంలో తన కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించి బరిలో నిలిచాడు. అయితే, అతడిపై నమ్మకముంచిన కోల్‌కతా అంతే ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. గత మూడేళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌లో కొనసాగిన అతడిని జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హర్భజన్ ట్విట్టర్ వేదికగా పలు విషయాలను వెల్లడించాడు.

ఈ సందర్భంగా తనను తీసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కేకేఆర్‌ మరో ట్రోఫీ గెలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నాడు. అలాగే తన నుంచి ఎల్లప్పుడూ వంద శాతం కచ్చితమైన ప్రదర్శన ఆశించొచ్చని భరోసా ఇచ్చాడు. దీనిపై స్పందించిన కోల్‌కతా.. భజ్జీ రాకను స్వాగతించింది. మరిన్ని వరుస విజయాలు అందించే ఆటగాడు వచ్చాడని, అతడి రాకతో మరింత ఆనందం నెలకొందని రీట్వీట్‌ చేసింది.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడిన వెటరన్‌ స్పిన్నర్‌ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. మరోవైపు 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న అతడు 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో హర్భజన్‌ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది.

IPL Auction 2021: అర్జున్ టెండూల్కర్ టాలెంట్‌ను ముందే ఊహించారా..! ముంబయి టీమ్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ ఏం చెప్పాడంటే..