బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరి నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను కైవం చేసుకుంది. అలాగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లతో కోహ్లీ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్‌తో ఉన్న జెర్సీని ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అండ్ కీపర్ అలెక్స్ కారీకి బహుమతిగా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో, విరాట్ కోహ్లీ ఆసీస్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం, వారికి జెర్సీలు మనం ఇవ్వడం చూడవచ్చు.
కాగా మూడేళ్ల మూడు నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. మొత్తం 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేశాడు విరాట్. ఇది కోహ్లీ టెస్టు కెరీర్‌లో 28వ సెంచరీ. అలాగే ఓవరాల్ కెరీర్‌లో 75వ సెంచరీ. 2019లో బంగ్లాదేశ్‌పై చివరి టెస్టు సెంచరీ సాధించాడు. 41 ఇన్నింగ్స్‌ల సుదీర్ఘ వ్యవధిలో కోహ్లి ఈ సెంచరీ సాధించడం విశేషం. కాగా టెస్టు సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్- ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పైనే ఉంది. మొదటి మ్యాచ్ ఈనెల 17న జరుగుతుంది.
King Kohli ? had some memorabilia to give to his Australian teammates post the final Test ????
Gestures like these ??#TeamIndia | #INDvAUS pic.twitter.com/inWCO8IOpe
— BCCI (@BCCI) March 13, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..