Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్నప్పుడు అతనొక్కడే నాకు మెసేజ్‌ చేశాడు.. కింగ్‌ కోహ్లీ ఎమోషనల్‌

|

Sep 05, 2022 | 9:43 AM

Asia Cup 2022: గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న కింగ్‌ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియాకప్‌లో వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించి 'ఫామ్‌ టెంపరరీ.. క్లాస్‌ పర్మినెంట్' అన్న మాటను మరోసారి నిజం చేశాడు. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విరాట్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్నప్పుడు అతనొక్కడే నాకు మెసేజ్‌ చేశాడు.. కింగ్‌ కోహ్లీ ఎమోషనల్‌
Virat Kohli
Follow us on

Asia Cup 2022: గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న కింగ్‌ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియాకప్‌లో వరుసగా రెండు అర్ధసెంచరీలు సాధించి ‘ఫామ్‌ టెంపరరీ.. క్లాస్‌ పర్మినెంట్’ అన్న మాటను మరోసారి నిజం చేశాడు. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విరాట్‌ ఎమోషనల్‌ అయ్యాడు. గత కొన్ని నెలలుగా తాను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు కేవలం ధోని మాత్రమే తనకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడని గుర్తు చేశాడు. ‘నేను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్‌ ధోని భయ్యా నుంచి వచ్చింది. నేను అంతకు ముందు కలిసి ఆడిన వారందరిలో కేవలం అతనొక్కడే నాకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. నా నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నది. కానీ కేవలం ఎంఎస్ మాత్రమే మెసేజ్‌ చేశాడు. ఇద్దరి ఆటగాళ్ల మధ్య గౌరవం ఉన్నప్పుడే ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. నాకు ఎప్పుడు కావాలనుకున్నా ఎంఎస్‌డీని వ్యక్తిగతంగా చేరుకోగలను’ అని ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు కోహ్లీ.

కాగా ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. అలాగే కొంతమంది అతనిని విశ్రాంతి తీసుకోవాలని, జట్టు నుంచి తప్పుకోవాలని సలహాలు, సూచనలు ఇచ్చారు. వీటన్నింటికీ కూడా సింపుల్‌గా కౌంటర్ ఇచ్చాడు కింగ్‌ కోహ్లీ. ‘ నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే.. ఆ వ్యక్తిని పర్సనల్‌గా రీచ్ అవుతాను. అందరి ముందు బహిరంగంగా మీరు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం నేను వాటికి విలువ ఇవ్వను. నేను ఆటలో ఎంతో నిజాయతీగా ఉన్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను’ అని తనపై వస్తోన్న విమర్శలకు సమాధానమిచ్చాడు విరాట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..