India vs Pakistan: చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే పైచేయి.. భారత్‌పై విజయం..

India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా పాక్‌ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో...

India vs Pakistan: చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే పైచేయి.. భారత్‌పై విజయం..
Ind Vs Pak
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 04, 2022 | 11:45 PM

India vs Pakistan: ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ విజయాన్ని సాధించింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా పాక్‌ ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ ఫోర్‌ దశలో భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ బ్యాట్స్‌మెన్‌ చివరి బంతి వరకు పోరాడి చేధించారు. మహ్మద్‌ రిజ్వాన్‌ (71), మహ్మద్‌ నవాజ్‌ (42) పరుగులతో పాకిస్థాన్‌ స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు.

అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్‌ బాట పట్టడంతో ఒకానొక సమయంలో పాకిస్థాన్‌ ఓటమి దిశగా అడుగులు వేసింది. కానీ తర్వాత క్రీజులోకి వచ్చిన అసిఫ్‌ అలి (16), ఖుష్దిల్ షా (14) పరుగులతో రాణించడంతో పాకిస్థాన్‌ ఇంకా ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉండగా నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 181 పరుగుల చేసింది. టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే విరాట్‌ కోహ్లి (60) పరుగులతో రాణించాడు. అనంతరం రాహుల్‌, రోహిత్‌ (28) పరుగులు చేశారు. ఈ టోర్నీలో భారత్‌కు మొదటి ఓటమి ఇదే. ఇక సెప్టెంబర్‌ 6వ తేదీని టీమిండియా శ్రీలంకతో తలపడనుంది.