Virat Kohli: టీ20, టెస్ట్‌లకు గుడ్‌బై.. వన్డే ఫార్మాట్‌తో విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా?

Virat Kohli Income: రూ. 1000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతను ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇకపై వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడనున్నాడు.

Virat Kohli: టీ20, టెస్ట్‌లకు గుడ్‌బై.. వన్డే ఫార్మాట్‌తో విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా?
Virat Kohli

Updated on: May 14, 2025 | 12:37 PM

Virat Kohli Earnings: తొలుగ టీ20 నుంచి రిటైర్మెంట్.. ఆ తర్వాత టెస్ట్‌ల నుంచి కూడా రిటైర్మెంట్.. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టీం ఇండియా తరపున విరాట్ కోహ్లీ ఇంకా ఎంత సంపాదించగలడు? మొత్తం మీద చూస్తే, సంపాదనలో విరాట్ కోహ్లీ ముందంజలో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ నికర విలువ ఇతర క్రికెటర్ల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. టీం ఇండియా జెర్సీలో ఆడటం ద్వారా డబ్బులు సంపాదించడం విషయానికి వస్తే, కోహ్లీ ఏ ఫార్మాట్‌లో ఆడబోతున్నాడనే దానిపై దృష్టి ఉంటుంది. అంటే, విరాట్ ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తాడనే విషయం తెలిసిందే. ఒక్క ఫార్మాట్‌లో ఆడడం ద్వారా కోహ్లీ ఎంత సంపాదిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం..

విరాట్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడొచ్చు..?

టీ20 తర్వాత టెస్ట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే జరిగితే ముందుగా భారతదేశం అప్పటి వరకు ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడాలో మనం తెలుసుకోవాలి? కోహ్లీ ఆడే వన్డే మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా అతని భవిష్యత్తు సంపాదన నిర్ణయించనున్నారు.

9 సిరీస్‌లు, 27 మ్యాచ్‌లు..!

2027 ప్రపంచ కప్‌నకు ముందు టీం ఇండియా 9 వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మొత్తం 27 మ్యాచ్‌లు ఉంటాయి. ఏదైనా కారణం చేత షెడ్యూల్ మారితే ఇందులో మార్పులు చోటు చేసుకుంటాయి. బంగ్లాదేశ్‌తో ఈ ప్రచారం ఆగస్టు 2025లో ప్రారంభమవుతుంది. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు, భారతదేశం తన చివరి సిరీస్‌ను డిసెంబర్ 2026లో ఆడనుంది.

ఇవి కూడా చదవండి

ఒక మ్యాచ్ కి 6 లక్షల రూపాయలు..

ప్రస్తుతం, టీం ఇండియా ఆటగాళ్లు ప్రతి వన్డే ఆడటానికి రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజును అందుకుంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 9 సిరీస్‌లలోనూ ఆడితే.. అంటే అతను 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు 27 మ్యాచ్‌ల్లోనూ ఆడితే, రూ. 6 లక్షల మ్యాచ్ ఫీజుతో గరిష్టంగా రూ. 1.62 కోట్లు సంపాదించవచ్చు.

ఆదాయం కూడా ఇలాగే పెరుగుతుందా?

ఇది కాకుండా, అతను ఆడిన వన్డే మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా మారితే, అది కూడా అతనికి ప్రత్యేక ఆదాయం అవుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ టీం ఇండియాలో భాగమైతే, అతని సంపాదన మరింత పెరిగే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఆ టోర్నమెంట్‌లో విరాట్ ఆడితే అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడో తెలుస్తుంది. ఎందుకంటే అతని సంపాదన ఆడిన వన్డే మ్యాచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..