
Virat Kohli and Rohit Sharma Last Match: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. విరాట్ కోహ్లీ భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేశాడు. సెమీ-ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాపై అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించడం ద్వారా టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించాడు. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పుడు టైటిల్ పోరు న్యూజిలాండ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, స్టార్ స్పోర్ట్స్ రోహిత్, విరాట్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల అభిమానులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రసంగంలో అభిమానుల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. జట్టు తరపున మెరుగైన ప్రదర్శన ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘అభిమానుల మద్దతు, ప్రేమను మేం ఎల్లప్పుడూ విలువైనదిగా భావిస్తాం, గౌరవిస్తాం. మీరు ఎల్లప్పుడూ మా జట్టుకు అండగా ఉంటారు. మీ మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. మేం ఎల్లప్పుడూ దానికి కట్టుబడి ఉంటాం, భారత జెండా ఎగురవేయడానికి మైదానంలో మేం చేయగలిగినదంతా చేస్తాం. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మేం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
The roar of a billion fans fuels Team India! 🔥🇮🇳
Team India are set to play the #CT2025 Final against New Zealand and they need your cheers louder than ever! 📣💪#ChampionsTrophyOnJioStar FINAL 👉 #INDvNZ | SUN, 9th MAR, 1:30 PM on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/04JtDhvrQA
— Star Sports (@StarSportsIndia) March 8, 2025
రోహిత్ శర్మ కూడా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ‘అభిమానులందరికీ వారి మద్దతుకు ధన్యవాదాలు. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. మాకు ఇలాగే మద్దతు ఇస్తూ ఉంటే, మేమందరం చాలా సంతోషంగా ఉంటా. మేం మిమ్మల్ని నిరాశపరచబోమని, మా వంతు కృషి చేస్తాం’ అంటూ తెలిపాం.
రోహిత్, విరాట్ ఇద్దరికీ ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు. రోహిత్ శర్మకు త్వరలో 38 ఏళ్లు నిండబోతున్నాయి, విరాట్‌కు కూడా 36 ఏళ్లు నిండుతాయి. తదుపరి ఛాంపియన్స్ ట్రోఫీ 2029లో జరుగుతుంది. అంటే వారిద్దరూ ఈ టోర్నమెంట్‌లో ఆడటం దాదాపు అసాధ్యం. ఇటువంటి పరిస్థితిలో, న్యూజిలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్ రోహిత్, విరాట్‌ల చివరి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న ఏకైక ఆశ ఏమిటంటే వీరిద్దరికీ విజయవంతమైన వీడ్కోలు లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి