IND vs ENG 2022: భారత ఆటగాడు విరాట్ కోహ్లీ తన దూకుడు శైలికి ప్రసిద్ధి చెందాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్‌కు ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మైదానంలో తలపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగినా.. లార్డ్స్ వన్డేకు ముందు భిన్నమైన దృశ్యం కనిపించింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మైదానంలో చాలా సేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఫీల్డ్‌లో ఉన్న అభిమానులకు ఆ దృశ్యం బాగా నచ్చింది. దీంతో ఈ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన చివరి టెస్టులో జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ మైదానంలో కామెంట్ చేశాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో కూడా స్పందించాడు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు దగ్గరగా రావడంతో, అంపైర్ జోక్యం చేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ, ఇది పెద్ద విషయం కాదని, మైదానంలో పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపాడు.
‘మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది’
గత 10 ఏళ్లుగా నేను, విరాట్ కలుస్తూనే ఉన్నామని జానీ బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మా మధ్య పరస్పర అవగాహన చాలా బాగుంది. అదే సమయంలో, క్రికెట్ మైదానంలో గెలవడానికి బరిలోకి దిగుతామని, కాబట్టి కొన్ని సార్లు విషయాలు కంట్రోల్ చేసుకోవడం కష్టమని, ఇది పెద్ద విషయం కాదని తెలిపాడు. విశేషమేమిటంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 3 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా నిలిచాయి. దీంతో రేపు జరిగే మ్యాచ్‌పైనే ఇరుజట్లు ఫోకస్ చేసి, సిరీస్ గెలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
You have 5 seconds to Guess Their Conversation ??@imVkohli ? @jbairstow21 – Too much ?in one frame ?#ENGvIND #SonySportsNetwork pic.twitter.com/lPTq9cV3Yp
— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..