
Virat Kohli celebration: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న పోరులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వికెట్ పడగానే, విరాట్ కోహ్లీ చేసిన దూకుడు వేడుక ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. మైదానంలో ప్రత్యర్థి అని చూడకుండా కోహ్లీ తనదైన శైలిలో గర్జిస్తూ రోహిత్ ముందే సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మొదటి ఓవర్‌లోనే అవుట్ కావడంతో, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ఆర్సీబీ శిబిరంలో వణుకు పుట్టించాడు. కేవలం 9 బంతుల్లోనే 22 పరుగులు చేసి రోహిత్ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ రంగంలోకి దిగాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన ఒక అద్భుతమైన లెంగ్త్ బంతిని రోహిత్ శర్మ ఆడే క్రమంలో బంతి బ్యాట్ అంచుకు తగిలి వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లో పడింది. రోహిత్ అవుట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం మార్మోగిపోయింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం విరాట్ కోహ్లీ వేడుక. రోహిత్ వికెట్ ఎంత కీలకమో తెలిసిన కోహ్లీ, గాలిలోకి ఎగిరి గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. రోహిత్ పెవిలియన్ వైపు వెళ్తుండగా కోహ్లీ చేసిన ఈ ‘బాడాస్’ సెలబ్రేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్‌లో అన్ని జట్లపై అద్భుత రికార్డులు ఉన్న రోహిత్ శర్మకు, బెంగళూరు జట్టుపై మాత్రం కలిసి రావడం లేదు. గత ఎనిమిది సీజన్లుగా ఆర్సీబీపై రోహిత్ ఒక్క అర్థశతకం కూడా చేయలేకపోవడం గమనార్హం. 2018లో చివరిసారిగా 94 పరుగులు చేసిన రోహిత్, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 22, 19, 17, 38, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది.
𝘽𝙝𝙪𝙫𝙞-𝙛𝙪𝙡 exhibition of new-ball magic! 🤌
🎥 Just sit back and admire the swing of things! ❤️
Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/STbZ16mzbj
— IndianPremierLeague (@IPL) May 10, 2026
రోహిత్ శర్మ వంటి భారీ వికెట్ త్వరగా పడటంతో ముంబై ఇండియన్స్ ఒత్తిడిలో పడింది. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కోహ్లీ తన దూకుడైన ఫీల్డింగ్‌తో జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. రోహిత్ వికెట్ పడిన తర్వాత ముంబై బ్యాటర్లు నిలదొక్కుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ పోరులో కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్ చూస్తుంటే, ఈసారి కప్పు గెలవాలనే కసి ఆర్సీబీలో ఎంతలా ఉందో అర్థమవుతోంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. తిలక్ వర్మ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రియాన్ రికెల్టన్ 2, రోహిత్ శర్మ 22, నమన్ ధీర్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..