IND Vs WI: టీమిండియాకి విరాట్ కోహ్లీ శిష్యుడే పెద్ద తలనొప్పి.. కుదురుకుంటే కొంప మునిగినట్టే.!

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసింది. ప్రస్తుతం టీమిండియా తన నెక్స్ట్ సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది.

IND Vs WI: టీమిండియాకి విరాట్ కోహ్లీ శిష్యుడే పెద్ద తలనొప్పి.. కుదురుకుంటే కొంప మునిగినట్టే.!
Team India

Updated on: Jun 18, 2023 | 12:33 PM

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసింది. ప్రస్తుతం టీమిండియా తన నెక్స్ట్ సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ శిష్యుడు టీమిండియాను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఇంతకీ అతడెవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు జెర్‌మైనే బ్లాక్‌వుడ్. విండీస్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బ్లాక్‌వుడ్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్ 54 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30.52 సగటుతో 2839 పరుగులు చేశాడు. ఇందులో అతడు 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాదేశాడు.

ఇదిలా ఉంటే.. 2019లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వచ్చినప్పుడు, తాను విరాట్ కోహ్లీతో మాట్లాడానని.. అతడి దగ్గర నుంచి క్రికెట్‌లో మెలకువలు నేర్చుకున్నానని బ్లాక్‌వుడ్ చెప్పాడు. అవి భారత్‌పై కూడా అన్వయించుకోవాలని, క్రీజులో నిలబడి గరిష్టంగా పరుగులు చేస్తానని తెలిపాడు. బ్లాక్‌వుడ్ ఇటీవల సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 79 పరుగులు చేశాడు. అలాగే బ్లాక్‌వుడ్ తన చివరి టెస్ట్ సెంచరీని 2022, మార్చి 16న ఇంగ్లాండ్‌పై బ్రిడ్జ్‌టౌన్‌లో చేశాడు. తన కన్సిస్టెన్సిని భారత్‌పై కూడా కొనసాగిస్తానని నమ్మకంతో ఉన్నాడు బ్లాక్‌వుడ్.