AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: వామ్మో.. కివీస్‌పై ఏకంగా 11 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనున్న కోహ్లీ..!

Virat Kohli Records: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఈ సిరీస్‌లో అతడికి ఏకంగా 11 కీలక రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల రికార్డులు కోహ్లీ టార్గెట్‌గా మారాయి. ముఖ్యంగా 13 వేల వన్డే పరుగుల మైలురాయిపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

IND vs NZ: వామ్మో.. కివీస్‌పై ఏకంగా 11 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనున్న కోహ్లీ..!
Virat Kohli Records
Venkata Chari
|

Updated on: Nov 04, 2026 | 10:28 AM

Share

Virat Kohli Records: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడికి అరుదైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ సిరీస్‌లో కోహ్లీ తన బ్యాట్‌తో రాణిస్తే ఏకంగా 11 కీలక రికార్డులను అధిగమించవచ్చు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), రికీ పాంటింగ్ (Ricky Ponting) పేరిట ఉన్న రికార్డులు కూడా అతడి లక్ష్యంగా మారాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు, వన్డేల్లో 13 వేల పరుగులు, న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు వంటి ఘనతలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కింగ్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఇంకెన్ని మైలురాళ్లు అందుకుంటాడో చూడాలి.

కోహ్లీ బద్దలు కొట్టే అవకాశం ఉన్న 11 రికార్డులు ఇవే..!

1. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు

లిస్ట్-ఏ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 60 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించాలంటే కోహ్లీ మరో సెంచరీ సాధించాలి.

2. నంబర్ 3 స్థానంలో 13 వేల వన్డే పరుగులు

వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి మరో 12 పరుగులు అవసరం.

3. వన్డే ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు

వన్డే ఛేజింగ్‌లలో సచిన్ టెండూల్కర్ 8,720 పరుగులు సాధించాడు. ఈ రికార్డును అధిగమించేందుకు కోహ్లీ మరో 54 పరుగులు చేయాలి.

4. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు

న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ 1,971 పరుగులతో ముందున్నాడు. అతడిని అధిగమించేందుకు కోహ్లీకి మరో 75 పరుగులు అవసరం.

5. న్యూజిలాండ్‌పై 2 వేల వన్డే పరుగులు

కివీస్‌పై 2 వేల వన్డే పరుగుల మైలురాయిని అందుకునేందుకు కోహ్లీకి మరో 103 పరుగులు అవసరం.

6. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన భారతీయుడు

సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌పై 652 వన్డే పరుగులు సాధించాడు. ఈ రికార్డును అధిగమించేందుకు కోహ్లీ మరో 139 పరుగులు చేయాలి.

7. న్యూజిలాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ పరుగులు

న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ 3,345 పరుగులు చేశాడు. ఈ రికార్డును అధిగమించేందుకు కోహ్లీ మరో 179 పరుగులు సాధించాలి.

8. న్యూజిలాండ్‌పై అత్యధిక అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు

న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్ల రికార్డు సచిన్ పేరిట ఉంది. కోహ్లీ మరో అర్ధ సెంచరీ సాధిస్తే ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది.

9. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే హాఫ్ సెంచరీలు

న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక అర్ధ సెంచరీల విషయంలో రికీ పాంటింగ్ ముందున్నాడు. కోహ్లీ మరో రెండు అర్ధ సెంచరీలు సాధిస్తే అతడిని అధిగమించవచ్చు.

10. విజయవంతమైన ఛేజింగ్‌లలో అత్యధిక హాఫ్ సెంచరీలు

వన్డేల్లో విజయవంతమైన ఛేజింగ్‌లలో అత్యధిక 50 ప్లస్ స్కోర్ల రికార్డు కూడా పాంటింగ్ పేరిట ఉంది. ఈ ఘనతను అధిగమించేందుకు కోహ్లీకి మరో రెండు అర్ధ సెంచరీలు అవసరం.

11. 50 అవే వన్డేల్లో 50 ప్లస్ స్కోర్లు..

విదేశీ గడ్డపై వన్డేల్లో 50 ప్లస్ స్కోర్ల సంఖ్యను పెంచుకునేందుకు కోహ్లీకి మరో అర్ధ సెంచరీ అవసరం.

కింగ్ కోహ్లీపై అభిమానుల ఫోకస్..

న్యూజిలాండ్‌తో జరిగే ఈ సిరీస్ కోహ్లీకి మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటుకునే వేదిక కానుంది. ముఖ్యంగా సచిన్, పాంటింగ్ వంటి దిగ్గజాల రికార్డులను అధిగమించే అవకాశం ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us