Video: ఆ ప్లేయర్‌ సీనియర్‌ అని మాపై పెత్తనం చెలాయించేవాడు..! రిషభ్‌ పంత్‌ సంచలన కామెంట్స్‌

రిషభ్ పంత్, గౌతం గంభీర్, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మ "ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో"లో పాల్గొన్నారు. పంత్, రోహిత్ శర్మను "టీమిండియాలో పెద్ద కోడలిలా" అని వర్ణించాడు, అతని ఆధిపత్యం గురించి హాస్యంగా మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Video: ఆ ప్లేయర్‌ సీనియర్‌ అని మాపై పెత్తనం చెలాయించేవాడు..! రిషభ్‌ పంత్‌ సంచలన కామెంట్స్‌
Rishabh And Rohit

Updated on: Jul 05, 2025 | 4:26 PM

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్‌ టూర్‌తో బిజీగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు ఆడుతోంది. ఆ మ్యాచ్‌ సంగతి పక్కనపెడితే.. ఈ టూర్‌ కంటే ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, రిషభ్‌ పంత్‌, యుజ్వేంద్ర చాహల్‌, అభిషేక్‌ శర్మ ఒక షోలో పాల్గొన్నారు. ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు, కోచ్‌ గంభీర్‌ పాల్గొని సరదాగా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో రిషభ్‌ పంత్‌ సరదాగా చెప్పిన కొన్ని సమాధానాలు వైరల్‌గా మారాయి. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో జఠాని (తోటి కోడలు) ఎవరు? ఒక సీనియర్‌ అనే కారణంతో ఆమెలా ఇంట్లో అందరిపై పెత్తన ఎవరు చెలాయిస్తారని హోస్ట్‌ అడగ్గా.. అందుకు రిషభ్‌ పంత్‌ మరేమి ఆలోచించకుండా రోహిత్‌ భాయ్‌ అని సమాధానం ఇచ్చేశాడు.

జట్టులో అందరిపై ఇంట్లో పెద్ద కోడలిలా రోహిత్‌ శర్మ అందరిపై పెత్తనం చెలాయిస్తాడంటూ పంత్‌ సరదాగా పేర్కొన్నాడు. ఆ వెంటనే హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అతను రిటైర్ అయిపోయాడని అతని పేరు చెబుతున్నాడు అంటూ నవ్వాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. టీమిండియాలోని ఆటగాళ్లంతా సరదా సరదాగా ఉంటారనే విషయం తెలిసిందే. గతంలో రోహిత్‌ శర్మ కూడా ఇదే షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆటగాళ్ల మధ్య ఉండే బాండింగ్‌తోనే వాళ్లంతా ఇంత ఓపెన్‌గా తమ తోటి ఆటగాళ్ల పేర్లు చెబుతున్నారని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. నిజానికి రోహిత్‌ శర్మ కాస్త కోపిష్టి మనిషే అయినా.. అందరితో చాలా కలుపుగోలుగా ఉంటాడు.

కెప్టెన్‌గా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో.. ఆఫ్‌ ది ఫీల్డ్‌ ఆటగాళ్లతో కలిసి అంతే అల్లరి చేస్తాడు. అతని కెప్టెన్సీలోనే టీమిండియా 2024లో టీ20 వరల్డ్‌ కప్‌, 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఆటగాళ్లతో ఒక కెప్టెన్‌గా ఆ ర్యాపో మెయిటేన్‌ చేయకుంటే ఒక టీమ్‌గా ఇలాంటి విజయాలు సాధించడం కష్టం. వీటి కంటే ముందు.. రోహిత్‌ కెప్టెన్సీలోనే టీమిండియా 2023లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ కూడా ఆడింది. ఒక ఆటగాడిగా టీమిండియాకు ఎంతో చేసిన రోహిత్‌, కెప్టెన్‌గా కూడా తన మార్క్‌ చూపించాడు. ఇటీవలె టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ కూడా కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..