
ప్రత్యర్ధుల పరుగుల వేట కొనసాగుతోంది. మన బౌలర్లు ఏం చేయలేకపోతున్నారని.. జట్టులోని ప్రధాన బౌలర్‌పైనే తిట్ల వర్షం కురిపిస్తే.. అది తిరిగి మనకే వస్తుంది మర్చిపోయినట్టున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. అడిలైడ్ వేదికగా జరుగుతోన్న యాషెస్ మూడో టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌండరీలతో చెలరేగి.. అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
ఇది చదవండి: ‘మా దగ్గర డబ్బులు లేవు సర్’.. కట్ చేస్తే.. అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
ఈ సమయంలో ఆర్చర్ బౌలింగ్‌పై స్టోక్స్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా లేదు.. సరిచేసుకుని సరిగ్గా బౌలింగ్ వేయాలని ఆర్చర్‌కు చెప్పాడు స్టోక్స్. అసలే అంతర్జాతీయంగా మంచి అనుభవమున్న బౌలర్.. అలా అంటే ఊరుకుంటాడా.. ఆ తర్వాత స్టార్క్ వికెట్ పడగొట్టి గట్టిగానే సమాధానమిచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. అటు బంతితోనే కాదు.. ఇటు బ్యాట్‌తోనూ ఆర్చర్ అదరగొట్టాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి 9వ వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
స్టోక్స్ 83 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆర్చర్ 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 పరుగులతో రాణించాడు. కాగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియాకు 93 పరుగుల ఆధిక్యం వచ్చింది. అటు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ సెంచరీ(106)తో దుమ్మురేపగా.. ఖవాజా 82 పరుగులు, స్టార్క్ 54 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టగా.. కార్సే, జాక్స్ తలో రెండు వికెట్లు, టంగ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇది చదవండి: కపిల్‌దేవ్ అంతటివాడవుతాడని అనుకుంటే.. తుస్సుమనిపించి షెడ్డుకెళ్లాడు.. మరి రీ-ఎంట్రీ ఎలా.?
Ben Stokes saying to Archer
Mate don’t complain about the field placings when you bowl.“Bowl on the stumps” he says and yep and look what happens.#ashes25 #AUSvENG pic.twitter.com/jrB46LSlyF
— Bemba Tavuma 𝕏 🐐 (@gaandfaadtits) December 18, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి