Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు.. కమ్‌బ్యాక్‌కు కారణం ఎవరో చెప్పేసిన వరుణ్ చక్రవర్తి

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో T20Iలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. తాజాగా ఈ విషయంపై వరుణ్ చక్రవర్తి స్పందించాడు.

Varun Chakaravarthy: మ్యాచ్ పోయినా సౌతాఫ్రికాను వణికించాడు..  కమ్‌బ్యాక్‌కు కారణం ఎవరో చెప్పేసిన వరుణ్ చక్రవర్తి
Varun Chakaravarthy

Updated on: Nov 11, 2024 | 4:06 PM

భారత జట్టులో తన పాత్రపై క్లారిటీ రావడానికి గౌతమ్ గంభీర్‌తో తాను జరిపిన చర్చలు సహాయపడాయని లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డాడు. 33 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ గంభీర్ ఆధ్వర్యంలో 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఉన్నాడు. ఇటీవలే భారత ప్రధాన కోచ్‌గా  గౌతమ్ గంభీర్‌ నియమితులైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో T20Iలో వరుణ్ చక్రవర్తి  5/17తో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. చక్రవర్తి మూడు సంవత్సరాల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, చక్రవర్తి వికెట్ టేకింగ్ సామర్థ్యంతో దక్షిణాఫ్రికా 125 పరుగుల ఛేదనలో చాలా ఇబ్బందిపడింది.

“ఖచ్చితంగా.. తనకు గత మూడు సంవత్సరాలు కొంచెం కఠినమైనవి” అని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. “తాను చేయగలిగేది చాలా క్రికెట్ ఆడటమే అని.. దేశీయ లీగ్ (TNPL) ఆడటం వల్ల తన ఆటను బాగా అర్థం చేసుకోవడానికి  సహాయపడిందని పేర్కొన్నారు. 30-40 పరుగులు ఇచ్చిన ఏం పర్వాలేదు గానీ వికెట్లు మాత్రం తీయాలని గంభీర్ సూచించినట్లు వరుణ్ తెలిపాడు. భారత జట్టులో తన పాత్రపై గంభీర్ క్లారిటీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించింది. చకరవర్తి అద్భుతమైన ఫామ్‌తో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల నష్టానికి 66 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (47), గెరాల్డ్ కోయెట్జీ (19) 19 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి