
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. అతని భారీ షాట్లు, స్టైలిష్ ప్లే అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. ఇది కేవలం అతని బ్యాటింగ్ ప్రదర్శన గురించి కాదు, వైభవ్ బ్యాటింగ్ ఎందుకు అంత ప్రత్యేకమో, ఎందుకు అంత డేంజరస్‌గా మారిందో తెలియజేస్తుంది. 70 సెకన్ల లోపే ఉన్న ఈ వీడియోలో, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు సంబంధించిన 5 కీలక రహస్యాలు వెల్లడయ్యాయి.
ఈ 5 సీక్రెట్లను ఇంకెవరో కాదు, శ్రీలంక క్రికెట్ దిగ్గజం 594 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 28,000కు పైగా పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర వెల్లడించాడు. సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. కాబట్టి, వైభవ్ బ్యాటింగ్‌లోని లోటుపాట్లు, అతడి స్పెషాలిటీ సంగక్కరకు బాగా తెలుసు.
సంగక్కర చెప్పిన వైభవ్ బ్యాటింగ్‌లోని 5 ముఖ్యలక్షణాలు ఇవే. వైభవ్ సూర్యవంశీ షాట్ ఆడటానికి చాలా సమయం తీసుకుంటాడు. అంటే, బంతిని ఆలస్యంగా ఆడి, సరైన సమయంలో కొడతాడు. ఇది అతని బ్యాటింగ్‌లోని పెద్ద ప్లస్ పాయింట్. తొందరపడకుండా బంతిని అంచనా వేసి కొట్టడం అతనికి చాలా ఉపయోగపడుతుంది. రెండవది, అతని బ్యాట్ స్వింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాట్ పూర్తి స్థాయిలో తిప్పి, బంతికి మంచి ఎనర్జీని అందిస్తాడు. ఇది అతను బౌండరీలు సాధించడానికి చాలా సహాయపడుతుంది.
మూడవది, క్రీజ్‌లో వైభవ్ కదలిక చాలా తక్కువగా, చాలా సింపుల్‌గా ఉంటుంది. అనవసరమైన కదలికలు ఉండవు. ఇది అతని బ్యాలెన్స్ కాపాడుకోవడానికి, బంతిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. నాల్గవది, వైభవ్ చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటాడు. కొత్త షాట్‌లు ఆడటానికి ఏమాత్రం వెనుకాడడు. ఇది అతని దూకుడు స్వభావానికి నిదర్శనం, టీ20 క్రికెట్‌లో ఇలాంటి ధైర్యం చాలా అవసరం.
'The rise of Vaibhav' 🌟 Rajasthan Royals Director of Cricket Kumar Sangakkara on his first encounter with the rising star 🗣️ pic.twitter.com/uFPATITFTQ
— Sky Sports Cricket (@SkyCricket) July 20, 2025
ఐదవది, చివరిది అతని పవర్. బంతిని బ్యాట్‌తో కొట్టినప్పుడు వచ్చే శబ్దం గన్‌షాట్ లాగా ఉంటుందని సంగక్కర చెప్పాడు. అంటే, వైభవ్ షాట్‌లలో ఎంత బలం ఉందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. బంతిని బాదినప్పుడు అది బుల్లెట్‌లా దూసుకుపోతుంది. ఈ ఐదు లక్షణాల వల్లే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అంత ప్రమాదకరంగా ఉంటుందని సంగక్కర వివరించాడు. వైభవ్ ప్రస్తుతం అండర్-19 క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను తన యూత్ టెస్ట్ కెరీర్‌లో 200 పరుగులకు చేరువలో ఉన్నాడు, అంతేకాదు, ఒకే ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది. ఇలాంటి యంగ్ టాలెంట్ మీద సంగక్కర వంటి ఎక్స్ పీరియర్స్ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి