9 ఫోర్లు, 14 సిక్స్‌లో సూపర్ సెంచరీ.. మరోసారి రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav suryavanshi Century: ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై యువ భారత బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి.

9 ఫోర్లు, 14 సిక్స్‌లో సూపర్ సెంచరీ.. మరోసారి రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi

Updated on: Dec 12, 2025 | 1:30 PM

ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడింది. యువ భారత బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఓ లైఫ్ అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.

మళ్లీ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ..

ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తో సంచలనం సృష్టించాడు. తొలుత జాగ్రత్తగా ఆడినా.. స్థిరపడిన తర్వాత, వరుసగా సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అతను కేవలం 30 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అతను అక్కడితో ఆగలేదు. బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. 56 బంతుల్లోనే తన సెంచరీని చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. 84 బంతుల్లోనే 150 పరుగుల మార్కును దాటాడు. చివరికి 171 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది అతని యూత్ వన్డే కెరీర్‌లో అత్యధిక ఇన్నింగ్స్. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్ అండర్-19పై అతని మునుపటి అత్యుత్తమ స్కోరు 143 పరుగులు. అంటే, తొలిసారిగా 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లు బాదాడు.

వైభవ్ సూర్యవంశీ తన సెంచరీని చేరుకోవడానికి రెండు లైఫ్‌లను పొందాడు. యూఏఈ జట్టు వైభవ్ సూర్యవంశీకి 28 పరుగుల సమయంలో మొదటి అవకాశాన్ని ఇచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వైభవ్‌కు.. ఆ తరువాత 85 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మరొక క్యాచ్ ఇచ్చాడు. కానీ, యూఏఈ ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది. దీంతో వైభవ్ తన సెంచరీని చేరుకున్నాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అతను అర్ధ సెంచరీని చేరుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించి, యుఎఇ బౌలర్లను పూర్తిగా ఓడించాడు.

ఇవి కూడా చదవండి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లోనూ అద్భుతాలు..

వైభవ్ సూర్యవంశీ గతంలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నమెంట్‌లో, అతను UAEపై 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. అందులో 15 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. అతను కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి