
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో జీటీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చినా, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ యువ ఓపెనర్, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవన్షీ అనే చెప్పాలి. తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది.
కీలక మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్, ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ధైర్యంగా ఆడాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్.. ప్రస్తుతం అతను ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతని బ్యాటింగ్ మెకానిక్స్, హ్యాండ్ స్పీడ్, ఫియర్‌లెస్ బ్యాటింగ్ స్టైల్ అసాధారణం. భవిష్యత్తులో అతనిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టంగా మారుతుంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రతిభకు మరో ఉదాహరణగా జీటీ బౌలర్ రబాడ వేసిన బౌన్సర్ హెల్మెట్‌కు తగిలినా అతను ఏమాత్రం బెదరకుండా మళ్లీ క్రీజ్‌లోకి వచ్చి దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండగా, రాజస్థాన్‌ను పోటీలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఐపీఎల్ 2026 మొత్తం సీజన్‌లో వైభవ్ అసాధారణ ఫామ్ ప్రదర్శించాడు. 16 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని స్ట్రైక్‌రేట్ 237కు పైగా ఉండటం విశేషం. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా త్వరలో శ్రీలంకలో జరిగే భారత ‘ఎ’ జట్టుకు కూడా అతనికి తొలి పిలుపు లభించింది. మరోవైపు గిల్ 53 బంతుల్లో 104 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్‌ను 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదింపజేశాడు. దీంతో గుజరాత్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మే 31న జరిగే టైటిల్ పోరులో ఆర్సీబీతో గుజరాత్ తలపడనుంది.