IND Vs ENG: 20 ఫోర్లు, 5 సిక్సర్లు.. 3 మ్యాచ్‌ల్లో వైభవ్ విధ్వంసం.. ఈసారి ఇంగ్లాండ్‌లో.!

భారత్, ఇంగ్లాండ్ మధ్య U19 ODI సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ హోవ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ, టీమ్ ఇండియా కెప్టెన్‌తో కలిసి చేసిన విధ్వంసం ఇంగ్లాండ్ అండర్ 19 జట్టును సందిగ్దంలో పడేసింది. ఆ వివరాలు

IND Vs ENG: 20 ఫోర్లు, 5 సిక్సర్లు.. 3 మ్యాచ్‌ల్లో వైభవ్ విధ్వంసం.. ఈసారి ఇంగ్లాండ్‌లో.!
Vaibhav Suryavanshi

Updated on: Jun 26, 2025 | 9:34 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న అండర్-19 వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. తన జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అండర్ 19 వన్డే సిరీస్‌లో భారత్ తరపున వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే ఓపెనింగ్ దిగారు. పరుగుల వరద పారించి.. ఇంగ్లాండ్‌పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జూన్ 27న హోవ్‌లో భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేతో కలిసి 3 మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ పార్టనర్‌షిప్ దిగాడు. ఆ 3 మ్యాచ్‌ల్లో, వారిద్దరూ కలిసి 81 బంతుల్లో 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో వారిద్దరూ కలిసి 25 బౌండరీలు కొట్టారు. అందులో 5 సిక్సర్లు, 8 ఫోర్లు వైభవ్ సూర్యవంశీ.. 12 ఫోర్లు ఆయుష్ మాత్రే బాదాడు.

ఇంగ్లాండ్‌పై తొలిసారి ఓపెనింగ్..

ఇప్పటివరకు మూడు U19 ODIలలో తన కెప్టెన్‌తో కలిసి 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా 5 సిక్సర్లు, 20 ఫోర్లతో ఇంగ్లాండ్‌కు సవాల్ విసిరారు. హోవ్‌లో జరగనున్న ODI భారత అండర్ 19 జట్టు తరపున వైభవ్, ఆయుష్ ఓపెనింగ్ నాలుగోసారి దిగబోతున్నారు. అంతకుముందు వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేసిన మూడు మ్యాచ్‌లు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగాయి. ఇంగ్లాండ్ U19 జట్టుతో ప్రారంభం కానున్న సిరీస్ అనేక విధాలుగా ప్రత్యేకమైనదని చెప్పాలి. కుడిచేతి వాటం ఆయుష్ మాత్రే, ఎడమచేతి వాటం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఈసారి వీక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి