World Test Championship 2025 Standings After New Zealand vs England, 1st Test: న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరిగిన మొదటి టెస్ట్ నాలుగో రోజున ముగిసింది. క్రిస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరిగిన ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు రెండో సెషన్‌లో ఇంగ్లండ్ 104 పరుగుల లక్ష్యాన్ని సులువుగా సాధించింది. ఈ విజయంలో బ్రైడెన్ కార్స్ ఆల్ రౌండ్ ప్రదర్శన కీలక పాత్ర పోషించింది. ఈ విజయంలో హీరోగా బ్రైడెన్ కార్స్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి, మొదటి ఇన్నింగ్స్‌లో 33* పరుగులు చేసి జట్టుకు గణనీయమైన ఆధిక్యాన్ని అందించాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసింది. ఇందులో కేన్ విలియమ్సన్ 197 బంతుల్లో 93 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 87 బంతుల్లో అజేయంగా 58 పరుగులు జోడించి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. ఇంగ్లండ్ తరపున బ్రైడెన్ కార్సే, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు తీశారు.
దీనికి సమాధానంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 499 పరుగుల భారీ స్కోరు సాధించింది. హ్యారీ బ్రూక్ 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 171 పరుగులు చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 146 బంతుల్లో 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మాట్ హెన్రీ 4 వికెట్లు పడగొట్టినా.. ఇంగ్లండ్‌ను భారీ స్కోరుకు చేరుకోకుండా ఆపడంలో విఫలమయ్యాడు.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తుందనిపించినా.. కేవలం 254 పరుగులకే ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ 167 బంతుల్లో 84 పరుగులు చేయగా, కేన్ విలియమ్సన్ 61 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్సే తన డేంజరస్ బౌలింగ్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ కారణంగా న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఇవ్వలేదు.
104 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సాధించింది. జాకబ్ బెటెల్ 37 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనితో పాటు బెన్ డకెట్ కూడా 27 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పులేదు. కానీ, పాయింట్లలో మాత్రం భారీగా తేగా కనిపించింది. ఇప్పటివరకు భారత్ 110 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా కేవలం 64 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 90 పాయింట్లు ఉన్నా ఆస్ట్రేలియా మాత్రం 3 వ స్థానానికి పరిమితమైంది. ఇక న్యూజిలాండ్ జట్టు 72 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. తాజాగా న్యూజిలాండ్‌పై గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు మాత్రం 105 పాయింట్లు దక్కాయి. కానీ, పాయింట్ల శాతంలో మాత్ర పెద్దగా పెరుగుదల కనిపించలేదు. దీంతో ఆరోస్థానంలోనే పరిమితమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..