
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఇద్దరు స్టార్ ప్లేయర్‌లపై కీలక చర్యలు తీసుకున్నారు. ఈ సీజన్‌లోని 15వ మ్యాచ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్ల మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 1 పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
యూపీ వారియర్స్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, కిరణ్ నవ్‌గిరే WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ జట్టు మ్యాచ్‌లో WPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో WPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు సోఫీ ఎక్లెస్టోన్, కిరణ్ నవ్‌గిరేలకు జరిమానా విధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) నుంచి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, సోఫీ, కిరణ్ ఇద్దరూ ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 ఉల్లంఘనను అంగీకరించారు. ఇది మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు లేదా మైదానంలోని పరికరాలను దుర్వినియోగానికి సంబంధించినది. దీని ప్రకారం, ప్రవర్తనా నియమావళి మొదటి స్థాయి ఉల్లంఘనపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం అంతిమమైనది.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం..
ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ అలిస్సా హీలీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ కావడంతో యూపీ వారియర్స్ ఉత్కంఠ విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..