Shameful Record : జో రూట్ కెరీర్ మీద మాయని మచ్చ..నిజంగా చెప్పాలంటే ఇదో చెత్త రికార్డు

ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్ట్ క్రికెట్ కెరీర్‌పై పెద్ద మచ్చ పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన జో రూట్, అత్యంత అవమానకరమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ ఖాతా తెరవకుండానే ఔట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

Shameful Record : జో రూట్  కెరీర్ మీద మాయని మచ్చ..నిజంగా చెప్పాలంటే ఇదో చెత్త రికార్డు
Joe Root

Updated on: Nov 23, 2025 | 12:16 PM

Shameful Record : ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్ట్ క్రికెట్ కెరీర్‌పై పెద్ద మచ్చ పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన జో రూట్, అత్యంత అవమానకరమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ ఖాతా తెరవకుండానే ఔట్ అవ్వగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రెండుసార్లు కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే అతను ఔటయ్యాడు. ఈ మ్యాచ్ వైఫల్యం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జట్టుపై ఒక్క సెంచరీ కూడా చేయకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మన్‌గా రూట్ నిలిచాడు.

జో రూట్ తన ఈ చెత్త రికార్డుతో మాజీ భారత బ్యాట్స్‌మన్‌ దిలీప్ వెంగ్సర్కార్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో వెంగ్సర్కార్ ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో సెంచరీ లేకుండా అత్యధికంగా 28 ఇన్నింగ్స్‌లు ఆడాడు. పెర్త్ టెస్ట్‌లో జో రూట్ రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమవ్వడంతో ఈ లిస్ట్‌లో రూట్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. జో రూట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ లేకుండా 29 ఇన్నింగ్స్‌లు పూర్తి చేశాడు.

టెస్ట్ క్రికెట్‌లో టాప్ 7లో బ్యాటింగ్ చేస్తూ, ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో జో రూట్ మొదటి స్థానంలో ఉండగా, వెంగ్సర్కార్ 28 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 19 ఇన్నింగ్స్‌లతో ఈ లిస్ట్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు, కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో (తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు) ఇంగ్లాండ్‌ను 172 పరుగులకే ఆలౌట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి, ఆస్ట్రేలియాను 132 పరుగులకే కట్టడి చేశారు (బెన్ స్టోక్స్ 5 వికెట్లు). దీంతో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగులు చేయడంతో, ఆస్ట్రేలియా ముందు 204 పరుగుల టార్గెట్ నిలిచింది.

204 పరుగుల టార్గెట్ కష్టమనిపించినప్పటికీ, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దానిని సులభతరం చేశాడు. హెడ్ కేవలం 83 బంతుల్లోనే 123 పరుగులతో ధనాధన్ సెంచరీ చేయడంతో, ఆస్ట్రేలియా కేవలం 204 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..