Sunrisers Hyderabad: గత ఐపీఎల్ సీజన్‌లో బాగా ఆకట్టుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) ఒకడు. జమ్మూకు చెందిన ఈ యంగ్ పేసర్ ఐపీఎల్-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున అరంగేట్రం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ కొవిడ్ బారిన పడడంతో అతని స్థానంలో చోటు దక్కించుకున్నాడు ఉమ్రాన్. అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా సద్వినియోగం చేసుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. కేవలం మూడు మ్యాచ్‌లే ఆడినప్పటికీ గంటకి 151.03 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. గత ఏడాది మాలిక్ కంటే వేగంగా లూకీ ఫెర్గూసన్ (151.33) మాత్రమే వేగంగా బంతిని వేయగలగడం విశేషం. ఇలా తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్‌ను ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందే రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్ .
బుల్లెట్ లాంటి బంతులతో..
కాగా ఐపీఎల్-2022 కు సమయం దగ్గర పడడంతో ఎస్‌ఆర్‌హెచ్ ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇంట్రా-స్క్వాడ్ (రెండు జట్లుగా విడిపోయి) ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు వేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఒక బౌన్సర్‌ని కనీసం టచ్ కూడా చేయలేకపోయిన పూరన్.. రెండో బంతిని ఫుల్ చేయబోయి నేరుగా స్వ్కేర్ లెగ్‌లోని ఫీల్డర్‌కి దొరికేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 సీజన్ ప్రారంభం కానుంది. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్ మార్చి 29న తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.
Umran Malik to Nicholas Pooran:
Ball 1: A SCARY bouncer
Ball 2: Another bouncer and OUT?: @SunRisers #IPL #IPL2022 #SunrisersHyderabad pic.twitter.com/yoVrItcA42
— Kashmir Sports Watch (@Ksportswatch) March 23, 2022
Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..