Rudi Koertzen : కారు ప్రమాదంలో దిగ్గజ అంపైర్‌ కన్నుమూత.. మిస్‌ యూ జెంటిల్మెన్‌ అంటూ సెహ్వాగ్‌ ఎమోషనల్‌

|

Aug 10, 2022 | 2:48 PM

Rudi Koertzen Demise: అంపైరింగ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న రూడీ కోయిర్జెన్‌ (Rudi Koertzen) మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సచిన్, సెహ్వాగ్, యువరాజ్‌ సింగ్‌, గిల్‌క్రిస్ట్‌, పాంటింగ్‌, సంగక్కర, జాక్వెస్ కల్లిస్ తదితర క్రికెట్‌ దిగ్గజాలు రూడీ మృతికి సంతాపం తెలిపారు.

Rudi Koertzen : కారు ప్రమాదంలో దిగ్గజ అంపైర్‌ కన్నుమూత.. మిస్‌ యూ జెంటిల్మెన్‌ అంటూ సెహ్వాగ్‌ ఎమోషనల్‌
Rudi Koertzen Demise
Follow us on

Rudi Koertzen Demise: దక్షిణాఫ్రికా దిగ్గజ అంపైర్ రూడి కోయిర్జెన్‌ (73) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రూడీ గోల్ఫ్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా, అతని కారు ప్రమాదానికి గురైంది. ఇందులో రూడీతో సహా మొత్తం నలుగురు మృత్యువాతపడ్డారు. నాన్న తన స్నేహితులతో కలిసి గోల్ఫ్‌ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లారు. అయితే నిన్న సోమవారమే తిరిగి వస్తారని మేం భావించాం. అయితే మరొక రౌండ్‌ను ఆడేందుకు ఉండాలని వారంతా నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయారు. అంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది’ రూడీ తనయుడు జూనియర్‌ రూడీ కోయిర్జెన్‌ తెలిపాడు. ఇదిలా ఉంటే అంపైరింగ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న రూడీ కోయిర్జెన్‌ (Rudi Koertzen) మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సచిన్, సెహ్వాగ్, యువరాజ్‌ సింగ్‌, గిల్‌క్రిస్ట్‌, పాంటింగ్‌, సంగక్కర, జాక్వెస్ కల్లిస్ తదితర క్రికెట్‌ దిగ్గజాలు రూడీ మృతికి సంతాపం తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

ట్విటర్‌ వేదికగా రూడీకి నివాళులర్పిస్తూ ‘ఓం శాంతి.. రూడీ కోయిర్జెన్ మృతికి ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. రూడీతో నాకు మంచి అనుబంధం ఉంది.. ఎప్పుడైనా కాస్త ర్యాష్‌గా షాట్‌ కొట్టినప్పుడు.. ఆయన వెంటనే తిట్టేవారు . కాస్త నిదానంగా ఆడు. నీ బ్యాటింగ్‌ ఇంకా చూడాలని ఉంది. అలాగే మా అబ్బాయికి మంచి క్రికెట్ ప్యాడ్స్‌ కొనాలి. ఏమైనా మంచి బ్రాండ్స్‌ ఉంటే చెప్పు’ అని నన్ను అడిగేవారు. ప్యాడ్స్‌ గురించి ఎంక్వైరీ చేసి మరీ ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చాను. కోయిర్జెన్‌ జెంటిల్‌మన్‌. అలాగే వ్యక్తిగతంగా అద్భుతమైన వ్యక్తి. రూడీ.. నిన్ను మిస్‌ అయ్యా.. ఓం శాంతి’ అని ఎమోషనల్‌ అయ్యాడు సెహ్వాగ్‌. కాగా 1992 నుంచి 2010 వరకు మొత్తం 331 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు కోయిర్జెన్‌. ఇందులో 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20లు ఉన్నాయి.


మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..