Team India: అండర్ 19లో అదరగొట్టిన టీమిండియా.. ప్రపంచకప్‌లో భారీ రికార్డ్.. తొలి జట్టుగా..

|

Jan 16, 2023 | 9:01 PM

U19 Womens T20 World Cup: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద స్కోరు నమోదు చేసింది.

Team India: అండర్ 19లో అదరగొట్టిన టీమిండియా.. ప్రపంచకప్‌లో భారీ రికార్డ్.. తొలి జట్టుగా..
U19 Womens World Cup
Follow us on

సౌతాఫ్రికాలో జరుగుతోన్న మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ (U19 Womens T20 World Cup)లో భారత జట్టు అద్భుతమైన ఫాంలో కనిపిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 122 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టు సరికొత్త రికార్డు..

ఈ మ్యాచ్‌లో టీమిండియా 219 పరుగులు చేసింది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ చరిత్రలో 200 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా భారత జట్టు నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో ఏ జట్టు అయినా ఇంత పెద్ద స్కోర్ చేయడం ఇదే తొలిసారి. భారత జట్టు తన పేరిట ఓ గొప్ప రికార్డు సృష్టించింది.

తుఫాన్ వేగంలో బ్యాటింగ్..

శ్వేతా సెహ్రావత్, కెప్టెన్ షెఫాలీ వర్మ, రిచా ఘోష్ భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 229.41 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 49 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె స్ట్రైక్ రేట్ 151.02గా నిలిచింది. అదే సమయంలో వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 168.97గా నిలిచింది.

ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో విజయం..

ఈ అండర్-19 ప్రపంచకప్‌లో మహిళల భారత జట్టు ఇప్పటివరకు మొత్తం 2 మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. భారత జట్టు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో యూఏఈపై ఆ జట్టు 122 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..