Double Hat trick: 6 బంతుల్లో 6 వికెట్లు.. డబుల్ హ్యాట్రిక్‌‌తో చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు..

|

Jun 16, 2023 | 6:40 PM

Oliver Whitehouse: క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించాలని ప్రతి బౌలర్ కలలు కంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే తమ కెరీర్‌లో ఇలా చేయగలరు. అయితే ఒకే ఓవర్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్లను చూడడం చాలా అరుదు. మ్యాచ్‌లో ఒక్క హ్యాట్రిక్ తీయడమే బౌలర్‌కి చాలా కష్టం.

Double Hat trick: 6 బంతుల్లో 6 వికెట్లు.. డబుల్ హ్యాట్రిక్‌‌తో చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు..
Hat Trick Wickets
Follow us on

క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించాలని ప్రతి బౌలర్ కలలు కంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, చాలా తక్కువ మంది మాత్రమే తమ కెరీర్‌లో ఇలా చేయగలరు. అయితే ఒకే ఓవర్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్లను చూడడం చాలా అరుదు. మ్యాచ్‌లో ఒక్క హ్యాట్రిక్ తీయడమే బౌలర్‌కి చాలా కష్టం. అదే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీయడం ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషకరమైన విషయం. 12 ఏళ్ల బాలుడు ఈ పని చేయడంతో పెద్ద సంచలనంగా మారింది.

ఈ 12 ఏళ్ల ఆటగాడి పేరు ఆలివర్ వైట్‌హౌస్.. ఇంగ్లండ్‌లోని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌తో ఆడుతూ ఆలివర్ ఈ సంచలనం నెలకొల్పాడు. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి భయాందోళనలు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

నమ్మశక్యం కాని రికార్డ్..

ఒలివర్ చూపించిన ఈఅద్భుతమైన ఆట వెనుక అతని కృషి, దృష్టి ఎంతో ఉంది. చిరకాలం నిలిచే తన ఆటతో అలాంటి ప్రభావాన్ని మిగిల్చాడు. ఇది అతని అత్యుత్తమ క్రికెట్ కెరీర్‌కు నాంది కూడా కావొచ్చని అంటున్నారు. బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ మొదటి జట్టు కెప్టెన్ జాడెన్ లీవిట్ BBCతో మాట్లాడుతూ.. ఆలివర్ చేసిన పనిని తాను నమ్మలేకపోతున్నానని, ఆలివర్‌కి ఇది ఎంత పెద్ద రికార్డో తెలియదు. అయితే దాని ప్రాముఖ్యత తరువాత వారికి తెలుస్తుందని’ చెప్పుకొచ్చాడు.

సంచలనం సృష్టించిన పోస్ట్..

క్లబ్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో డబుల్ హ్యాట్రిక్‌తో ఆలివర్ ఫోటోను షేర్ చేసింది. కొన్ని గంటల్లోనే ఆలివర్ హీరోగా మారాడు. ట్విట్టర్‌లో అతని పేరు చర్చనీయాంశంగా మారింది. అతని గురించి క్లబ్ చేసిన పోస్ట్ కొన్ని గంటల్లో 45,000 వ్యూస్ దాటింది.

ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఒలివర్ మొత్తం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఎలాంటి పరుగులు ఇవ్వకుండా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆలివర్ కుటుంబం క్రీడలతో అనుబంధం కలిగి ఉంది. అతని అమ్మమ్మ అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి. ఆలివర్ అమ్మమ్మ 1969లో వింబుల్డన్ గెలుచుకుంది. ఇది టెన్నిస్ నాలుగు గ్రాండ్ స్లామ్‌లలో ఒకటి. ఆమె పేరు ఆన్ జోన్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..