
Pakistan T20 World Cup 2026 Squad: బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలిపిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).. తాజాగా 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం నాడు చేసిన ప్రకటన, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహించి, స్వ్కాడ్‌ను ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని PCB ఓ ప్రకటనలో ధృవీకరించింది.
ఈ వారం ప్రారంభంలో బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగింది. కానీ, పాకిస్తాన్ మాత్రం టోర్నీలో ముందకు సాగాలని నిర్ణయం తీసుకుంది. అయితే, అంతకుముందు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ జట్టును అనుసరించవచ్చని గుసగుసలు వినిపించాయి. అకిబ్ జావేద్, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టోర్నమెంట్ కోసం పవర్ ఫుల్ టీంను ఎంచుకోవడంపై దృష్టి సారించింది.
అయితే, పాక్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన వార్త ఏంటంటే, బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిది తిరిగి రావడం. ఇటీవలి టీ20ఐ సిరీస్‌లో జట్టుకు దూరంగా ఉన్న తర్వాత, ఈ అనుభవజ్ఞులైన ద్వయాన్ని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ లైనప్‌కు యాంకర్‌గా బాబర్ తిరిగి వచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేస్ అటాక్‌లలో ఒకటిగా నిలిచిన జట్టుకు షహీన్, నసీమ్ షా నాయకత్వం వహించనున్నారు.
కాగా, ఎక్స్‌ప్రెస్ పేసర్ హారిస్ రవూఫ్‌ను 15 మంది సభ్యుల జట్టు నుంచి తొలగించారు. 2025 ఆసియా కప్ సమయంలో అతని ఇటీవలి ఫామ్ క్షీణించడం, ఫిట్‌నెస్ సమస్యలు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి. అదేవిధంగా, బిగ్ బాష్ లీగ్ (BBL)లో నిశ్శబ్దంగా ఆడిన తర్వాత అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు మాత్రం ఊరటనిచ్చింది.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్ , బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్ , ఫఖర్ జమాన్ , ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా , నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికె), సయీమ్ షాహ్ , షాహబ్ ఖాన్ , షహబ్, షహబ్, షహబ్, ఎ . ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిఖ్.
ఫిబ్రవరి 7 – కొలంబోలో పాకిస్తాన్ vs నెదర్లాండ్స్
ఫిబ్రవరి 10 – కొలంబోలో పాకిస్తాన్ vs అమెరికా
ఫిబ్రవరి 15 – కొలంబోలో భారత్ vs పాకిస్తాన్
ఫిబ్రవరి 18 – కొలంబోలో పాకిస్తాన్ vs నమీబియా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..