Fastest T20I Century: టీ20ఐలో ఫాస్టెస్ట్ సెంచరీ.. లిస్టులో భారత్‌ నుంచి ఇద్దరు.. ఎవరో తెలుసా?

టీ20లో సెంచరీ సాధించాలంటే బ్యాట్స్‌మెన్ చాలా వేగంగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదాలి. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు చాలా మంది వెటరన్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను టీ20లో నిపుణులుగా పరిగణిస్తారు. అయితే, సెంచరీ చేయడం గురించి మాట్లాడితే నేటికీ దిగ్గజ ప్లేయర్లకు ఇది సాధ్యం కాలేదు.

Fastest T20I Century: టీ20ఐలో ఫాస్టెస్ట్ సెంచరీ.. లిస్టులో భారత్‌ నుంచి ఇద్దరు.. ఎవరో తెలుసా?
Team India

Updated on: May 16, 2023 | 4:16 PM

టీ20లో సెంచరీ సాధించాలంటే బ్యాట్స్‌మెన్ చాలా వేగంగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదాలి. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు చాలా మంది వెటరన్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను టీ20లో నిపుణులుగా పరిగణిస్తారు. అయితే, సెంచరీ చేయడం గురించి మాట్లాడితే నేటికీ దిగ్గజ ప్లేయర్లకు ఇది సాధ్యం కాలేదు. మొత్తంగా భారత్ నుంచి నేటి వరకు మొత్తం 13 టీ20ఐ సెంచరీలు నమోదయ్యాయి. ఈ లిస్టులో ఏడుగురు ప్లేయర్లు తన పేర్లను లిఖించుకున్నారు.

టీ20 క్రికెట్‌లో 50 బంతుల్లోనే సెంచరీ చేసిన ఘనత భారత జట్టులో ఇప్పటి వరకు కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్‌కు మాత్రమే దక్కింది. వీరిలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు భారత్‌ తరపున టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

2. సూర్యకుమార్ యాదవ్ – 45 బంతులు..

మిస్టర్ 360 డిగ్రీ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ భారతదేశం తరపున టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించడంలో రెండవ స్థానంలో ఉన్నాడు. 2023 జనవరి 7న రాజ్‌కోట్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో మొత్తం 112 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 91 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

1. రోహిత్ శర్మ – 35 బంతులు..

రోహిత్ శర్మ భారత దూకుడైన ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అతను తన బ్యాటింగ్ ఆధారంగా భారత్‌కు చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. రోహిత్ భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీని సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.

2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో 12 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 274.41గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..