భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు ప్లేయర్ల హఠాన్మరణం.. చెట్టుకు వేలాడుతూ మహిళా క్రికెటర్ మృతదేహం

|

Jan 13, 2023 | 7:39 PM

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లు కన్నుమూశారు. అందులో ఒకరు మహిళా క్రికెటర్‌ కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ స్టార్‌ బౌలర్‌ సిద్ధార్థ్ శర్మ మృతి చెందాడు. అతని వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే.

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు ప్లేయర్ల హఠాన్మరణం.. చెట్టుకు వేలాడుతూ మహిళా క్రికెటర్ మృతదేహం
Rajashree Swain, Siddharth
Follow us on

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు ఇద్దరు క్రికెటర్లు కన్నుమూశారు. అందులో ఒకరు మహిళా క్రికెటర్‌ కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ స్టార్‌ బౌలర్‌ సిద్ధార్థ్ శర్మ మృతి చెందాడు. అతని వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. గత కొన్ని రోజులగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతను గుజరాత్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధార్థ్ తన జట్టుతో కలిసి గుజరాత్‌లో ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట అతను తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన హిమాచల్ ప్రదేశ్‌ జట్టులో సిద్ధార్థ్ శర్మ భాగంగా ఉన్నాడు. సిద్ధార్థ్ శర్మ మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్ ధుమాల్ కూడా పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం భాభోర్ సాహెబ్ శ్మశానవాటికలో సిద్ధార్థ్ అంత్యక్రియలు నిర్వహించారు.

చెట్టుకు వేలాడుతూ..

మరోవైపు ఒడిశాకు చెందిన‌ రాజ‌శ్రీ స్వెయిన్ అనే మ‌హిళా క్రికెట‌ర్ అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడింది. కటక్‌ నగరం సమీపంలోని దట్టమైన అడవుల్లో మహిళా క్రికెటర్‌ మృతదేహాన్ని పోలీసును కనుగొన్నారు. అక్కడ రాజశ్రీ మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆమె మరణానికి కారణాలు ఇంకా తెలియరావడం లేదు. అయితే త‌మ కూతురును ఎవ‌రో హ‌త్య చేశార‌ని రాజ‌శ్రీ కుటుంబస‌భ్యులు ఆరోపిస్తున్నారు. రాజ‌శ్రీ మృత‌దేహంపై ప‌లు చోట్ల గాయాలు ఉండడం, కళ్లు కూడా బాగా దెబ్బ తిని ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఘ‌ట‌నా స్థలానికి కొంత దూరంలో రాజ‌శ్రీ స్కూటీ క‌నిపించింది. అంతేకాదు ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వ‌స్తోంది.కాగా ఒడిశా మీడియా కథనాల ప్రకారం పుదుచ్చేరిలో జ‌ర‌గ‌నున్న జాతీయ స్థాయి టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం నిర్వహించింది. ఇందుకు రాజశ్రీతో పాటు 25 మంది ఎంపికయ్యారు. అయితే తాజాగా టోర్నమెంట్‌ కు ఎంపికైన వాళ్ల పేర్లను ఓసీఏ ప్రకటించింది. ఆ జాబితాలో రాజ‌శ్రీ పేరు లేదు. దీంతో ఆమె మ‌నోవేద‌న‌కు గురైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..