Video: అడిలైడ్‌లో టీమిండియా విలన్ ‘హల్చల్’.. 99 పరుగుల వద్ద లైఫ్.. ఆపై సెంచరీతో బ్రాడ్‌మాన్, స్మిత్ రికార్డులకే..

తొలి రెండు టెస్టులు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, ఈ మూడో టెస్టులోనూ పట్టు బిగించింది. ఓపెనర్‌గా హెడ్ దూకుడుగా ఆడుతుండటం ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టీవ్ స్మిత్ గైర్హాజరీలోనూ హెడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపిస్తున్నారు.

Video: అడిలైడ్‌లో టీమిండియా విలన్ హల్చల్.. 99 పరుగుల వద్ద లైఫ్.. ఆపై సెంచరీతో బ్రాడ్‌మాన్, స్మిత్ రికార్డులకే..
Travis Head Century

Updated on: Dec 19, 2025 | 2:00 PM

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అడిలైడ్ ఓవల్ మైదానానికి, ట్రావిస్ హెడ్‌కు మధ్య ఉన్న అనుబంధం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో హెడ్ సెంచరీ బాది తన జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ క్రమంలో ఆయన అనేక అరుదైన మైలురాళ్లను అందుకున్నారు.

99 పరుగుల వద్ద హైడ్రామా..

సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు హెడ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోగా, గల్లీలో ఉన్న హ్యారీ బ్రూక్ ఆ క్యాచ్‌ను నేలపాలు చేశారు. ఈ ‘లైఫ్’ను అందిపుచ్చుకున్న హెడ్, ఆ తర్వాత ఫోర్‌తో తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నారు. శతకం పూర్తి కాగానే తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అడిలైడ్ పిచ్‌ను ముద్దాడటం అందరినీ ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

బ్రాడ్‌మాన్, స్మిత్ రికార్డుల సమం,,

ఈ సెంచరీతో ట్రావిస్ హెడ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే వేదికపై (Adelaide Oval) వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచారు.

సర్ డాన్ బ్రాడ్‌మాన్: (మెల్‌బోర్న్, లీడ్స్ మైదానాల్లో ఈ ఘనత సాధించారు).

స్టీవ్ స్మిత్: (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో).

మైకేల్ క్లార్క్: (అడిలైడ్ ఓవల్‌లో).

ట్రావిస్ హెడ్: (అడిలైడ్ ఓవల్‌లో – వరుసగా విండీస్, భారత్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు).

అడిలైడ్‌లో హెడ్ అరాచకం..

గత కొన్ని ఏళ్లుగా అడిలైడ్‌లో హెడ్ గణాంకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ మైదానంలో ఆయన సగటు 82కు పైగా ఉండటం విశేషం. తాజా సెంచరీతో కలిపి గత నాలుగు అడిలైడ్ టెస్టుల్లో ఆయన చేసిన స్కోర్లు: 175, 119, 140, 103.*

యాషెస్‌లో ఆసీస్ ఆధిపత్యం..

తొలి రెండు టెస్టులు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, ఈ మూడో టెస్టులోనూ పట్టు బిగించింది. ఓపెనర్‌గా హెడ్ దూకుడుగా ఆడుతుండటం ఇంగ్లాండ్ బౌలర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. స్టీవ్ స్మిత్ గైర్హాజరీలోనూ హెడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..