IND vs SA: దక్షిణాఫ్రికాలో 1000+ పరుగులు.. లిస్టులో లిటిల్ మాస్టర్ ఒక్కడే.. ఒక్క సిక్స్ కొట్టని కోహ్లీ, ద్రవిడ్.. పూర్తి జాబితా ఇదే..!

|

Dec 14, 2021 | 12:51 PM

డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా తమ జట్టును ప్రకటించాయి. ఆఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా టీమిండియా గెలవలేదు.

IND vs SA: దక్షిణాఫ్రికాలో 1000+ పరుగులు.. లిస్టులో లిటిల్ మాస్టర్ ఒక్కడే.. ఒక్క సిక్స్ కొట్టని కోహ్లీ, ద్రవిడ్.. పూర్తి జాబితా ఇదే..!
India Vs South Africa
Follow us on

Top 5 Indian Test Batsman In South Africa: డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా తమ జట్టును ప్రకటించాయి. ఆఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా టీమిండియా గెలవలేదు. విరాట్‌ కోహ్లీ సేన ఈసారి సిరీస్‌ గెలవాలని కోరుకుంటోంది. దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 టెస్ట్ బ్యాట్స్‌మెన్ గురించి ఓసారి తెలుసుకుందాం.

1. సచిన్ టెండూల్కర్
దక్షిణాఫ్రికా గడ్డపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో టెండూల్కర్ 15 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 1161 పరుగులు వచ్చాయి. ఈ సమయంలో సగటు 46.44గా నిలిచింది. ఆఫ్రికన్ గడ్డపై మాస్టర్ బ్లాస్టర్ 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ముంబైకి చెందిన ఈ స్టార్ ప్లేయర్ 15 టెస్టుల్లో 172 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

2. రాహుల్ ద్రవిడ్
టీమిండియా కోచ్, మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 624 పరుగులు చేశాడు. అయితే, అతని సగటు 29.71 గా ఉంది. ఈ 11 టెస్టు మ్యాచ్‌ల్లో రాహుల్ 1 టెస్టు సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద్రవిడ్ అత్యుత్తమ స్కోరు 148 పరుగులు.

3. వీవీఎస్ లక్ష్మణ్..
వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ 1997 నుంచి 2011 వరకు దక్షిణాఫ్రికాలో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతను 40.72 సగటుతో 566 పరుగులు చేశాడు. అయితే ఆఫ్రికా గడ్డపై లక్ష్మణ్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అతని బ్యాట్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ సమయంలో లక్ష్మణ్ 76 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికాలో పరుగుల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు.

4. విరాట్ కోహ్లీ..
భారత టెస్టు జట్టు కెప్టెన్, విరాట్ కోహ్లీ 2013 నుంచి 2018 వరకు దక్షిణాఫ్రికా గడ్డపై 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో కోహ్లీ ఆటతీరు అద్భుతంగా ఉంది. అతను 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. కోహ్లి దక్షిణాఫ్రికాలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆఫ్రికా గడ్డపై కోహ్లీ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికైన జట్టులో దక్షిణాఫ్రికాలో చేసిన పరుగుల పరంగా టాప్-5లో ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్.

5. సౌరవ్ గంగూలీ..
టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగుల స్కోరర్ పరంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1996 నుంచి 2007 వరకు ఆఫ్రికా గడ్డపై 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 36.14 సగటుతో 506 పరుగులు చేశాడు. ఆఫ్రికా గడ్డపై దాదా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.

ఛెతేశ్వర్ పుజారా అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆరో స్థానంలో ఉన్నాడు. అతను 7 మ్యాచ్‌ల్లో 31.61 సగటుతో 711 పరుగులు చేశాడు.

Also Read: India Vs Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‎తో భారత్ మూడు మ్యాచ్‎ల వన్డే సిరీస్.. ఎప్పుడంటే..

The Ashes: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ.. ఏం చేస్తున్నాడో తెలుసా?