268 స్ట్రైక్ రేట్‌తో బౌలర్ల భరతం పట్టాడు.. 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. అతడెవరో తెలుసా?

|

Nov 23, 2021 | 4:58 PM

క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌ను మీరెప్పుడైనా చూశారా.? చూడకపోతే.! టామ్ కొల్లెర్ కాడ్మోర్ ఇన్నింగ్స్‌ చూస్తే చాలు ఖచ్చితంగా...

268 స్ట్రైక్ రేట్‌తో బౌలర్ల భరతం పట్టాడు.. 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. అతడెవరో తెలుసా?
Tom
Follow us on

క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌ను మీరెప్పుడైనా చూశారా.? చూడకపోతే.! టామ్ కొల్లెర్ కాడ్మోర్ ఇన్నింగ్స్‌ చూస్తే చాలు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఈ 27 ఏళ్ల బ్యాట్స్‌మెన్ కేవలం 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ నెల 22వ తేదీన షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఢిల్లీ బుల్స్, డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ తరపున బ్యాటింగ్‌కు దిగిన టామ్ కొల్లెర్ కాడ్మోర్ విధ్వంసం సృష్టించాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి ప్రత్యర్ధి బౌలర్ల భరతం పట్టాడు. అంతేకాకుండా టార్గెట్‌ను కేవలం 44 బంతుల్లో పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ రోసో 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అలాగే రూథర్‌ఫోర్డ్ 316 స్ట్రైక్ రేట్‌తో 6 బంతుల్లో 19 పరుగుల చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. ఇక డెక్కన్ గ్లాడియేటర్స్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమల్‌ మిల్స్‌, హసరంగ రెండేసి వికెట్లు తీశారు.

19 బంతుల్లో 51 పరుగులు…

ఢిల్లీ బుల్స్ విధించిన 112 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన డెక్కన్ గ్లాడియేటర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు టామ్ కోలెర్(51), టామ్ బంటన్(44)లు మొదటి వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డెక్కన్ గ్లాడియేటర్స్ కేవలం 7.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టార్గెట్ చేజ్‌లో టామ్ కోలెర్ కాడ్మోర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఎంతగానో సహాయపడింది. అతడు కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. అటు టామ్ బంటన్ 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు.